మాజీ ఏజెంట్ హత్యకు పుతిన్ ఓకే
లండన్: రష్యా విదేశీ నిఘా సంస్థ కేజీబీ మాజీ ఏజెంట్ అలెగ్జాండర్ లిత్వినెంకోను హత్య చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుమతి ఇచ్చి ఉండొచ్చని.. ఏజెంట్ మరణంపై బ్రిటన్ నిర్వహించిన దర్యాప్తు నిర్ధారించింది.
బ్రిటన్ నిఘా సంస్థ ఎంఐ6 కోసం, స్పెయిన్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న అలెగ్జాండర్‌ను 2006లో అణుధార్మికత గల పులోనియం-210 అనే విషపదార్థం ప్రయోగించి హత్యచేశారని.. ఆ పదార్థం కలిపిన టీ తాగిన అతడు కొద్ది రోజులకే లండన్ ఆస్పత్రిలో చనిపోయాడని.. దీనిపై విచారణ నిర్వహించిన హైకోర్టు మాజీ జడ్జి రాబర్ట్ ఓవెన్ గురువారం సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నారు.