3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో చంద్రుడిపై మానవ స్థావరాల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై పరిశోధిస్తున్న ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పలు డిజైన్లను రూపొందించింది. చంద్రుడి మట్టిని ఉపయోగించి త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఇటుకలు తయారు చేయడం, వాటితో స్థావరాలను నిర్మించడంపై ప్రయత్నిస్తున్న ఈసా ఈమేరకు తాజాగా చంద్రుడి మట్టిని పోలిన మట్టితో ఇటుకలను తయారు చేసింది. అంతరిక్షం నుంచి వచ్చే రేడియేషన్, ఉల్కాపాతం నుంచి రక్షణ కల్పించేలా ఈ ఇటుకలతో గోడలను నిర్మించవచ్చని ఈసా వెల్లడించింది.