
రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఒబామా
వాషింగ్టన్ : సైబర్ దాడుల ద్వారా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు బహిరంగంగా, రహస్యంగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యాను హెచ్చరించారు.
‘మన ఎన్నికల సమగ్రతపై ప్రభావం చూపడానికి కొన్ని విదేశీ ప్రభుత్వాలు ప్రయత్నించాయనడంలో సందేహం లేదు. దానిపై మనం తగిన చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకుంటాం కూడా’ అని ఓ ఇంటర్వూ్యలో చెప్పారు. సైబర్ దాడులపై తన అభిప్రాయాలేమిటో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తెలుసునని, నేరుగా ఆయనతోనే మాట్లాడాన చెప్పారు.