మాస్కో : కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా మూకుతాడు వేసే టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. యుద్ధ సమయంలో `బ్లాక్ ఔట్ బాంబు' టెక్నాలజీతో ఉత్తరకొరియా యుద్ధ సామగ్రికి కరెంటును సరఫరా చేసే సిస్టమ్స్(బ్యాటరీలు, జనరేటర్లు, సాధారణ విద్యుత్తు సరఫరా వ్యవస్థ)ను పని చేయకుండా నిలిపేయోచ్చు.
ఈ సాంకేతికతకు సంబంధించిన సమాచారాన్ని దక్షిణ కొరియాకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ బహిర్గత పరచింది. కేవలం విద్యుత్తు వ్యవస్థను లక్ష్యం చేసుకుని దాడి చేసే ఈ టెక్నాలజీని 'సాఫ్ట్‌బాంబ్' అని కూడా పిలుస్తారు. కాగా, ఈ నెల 10 ఉత్తరకొరియా అధికార పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరో మారు కిమ్ దేశం క్షిపణి ప్రయోగాలు చేయొచ్చనే రిపోర్టులు వస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుని దక్షిణ కొరియా నార్త్ కొరియాకు 'సాఫ్ట్ బాంబ్'తో షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఎలా వినియోగిస్తారు...
శత్రువు విద్యుత్తు వ్యవస్థలను టార్గెట్‌గా చేసుకుని కార్బన్ గ్రాఫైట్ ఫిలమెంట్‌లను గాలిలోకి వదులుతారు. ఈ గ్రాఫైట్ ఫిలమెంట్స్ గాలిలో తేలుతూ వెళ్లి విద్యుత్తు పరికరాలను చేరతాయి. అనంతరం గ్రాఫైట్ ఫిలమెంట్లు విద్యుత్ సరఫరాను అడ్డగిస్తాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ వ్యవస్థ నాశనం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment