ఓటుకు శృంగార మాత్ర | South Korea probes `sex pills for vote' scam | Sakshi
Sakshi News home page

ఓటుకు శృంగార మాత్ర

Published Wed, Apr 13 2016 11:04 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ఓటుకు శృంగార మాత్ర - Sakshi

ఓటుకు శృంగార మాత్ర

సియోల్: ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, ఖరీదైన వస్తువులను ఎరచూపి ఓటర్లను రాజకీయ నాయకులు ప్రలోభపెట్టడం సర్వసాధారణ విషయం. దక్షిణ కొరియ రాజకీయ నేతలు మరో అడుగు ముందుకేసి 'శృంగార మాత్రల'తో ఓటర్లకు గాలం వేశారు. లేజిస్లేటివ్ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఓట్ల కోసం నపుంసకత్వాన్ని నిరోధించే పిల్స్ పంపిణీ చేశారు. సియోల్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువొన్ ప్రాంతంలో ఈ వ్యవహారం సాగినట్టు ఆరోపణలు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

'ఓట్లను కొనేందుకు శృంగార మాత్రలు పంపిణీ చేశారని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాం. ఈ ఆరోపణలు నిజమైతే ఎన్నికల నియమాళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామ'ని అధికారులు ప్రకటించారు. నపుంసకత్వాన్ని నిరోధించే పిల్స్ ను డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకు వాడాల్సి ఉంటుంది. లేజిస్లేటివ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థిని వీటిని పెద్ద మొత్తంలో కొని ఓటర్లకు పంచినట్టు ఆరోపణలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement