కరెంట్ షాక్‌తో మంచి చూపు!
వాషింగ్టన్: మెదడులోకి ఇరవై నిమిషాల పాటు స్వల్పంగా కరెంటు ప్రసరింపజేయడం రెండు గంటల పాటు మన చూపును మెరుగు పరుస్తుందని పరిశోధనలో తేలింది. దీని వల్ల మెదడులోని ఇతర ప్రాంతాల్లోనూ ఆలోచించే శక్తి పెరుగుతుందట. కళ్లద్దాలు, లెన్స్‌లు లేకుండా ఎలా చూపును మెరుగుపరచాలన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని పరిశోధకులు అంటున్నారు.
ఇరవై మంది ఆరోగ్యవంతులైన, కంటి చూపు బాగున్న యువకులపై వీరు ఈ పరిశోధన నిర్వహించారు. ముందుగా వీరికి పరస్పరం లంబంగా ఉన్న రెండు సరళ రేఖలను చూపించారు. అనంతరం వారి మెదడులోకి 20 నిమిషాల పాటు స్వల్పంగా కరెంటు పంపా రు. ఆ తర్వాత వీరిలో 75 శాతం మంది ఇంతకు ముందు చెప్పిన సమాధానం కంటే సరైన సమాధానం చెప్పారట.