ఫేస్‌బుక్ గొడవ... 65 కత్తిపోట్లు
లండన్: ఫేస్‌బుక్‌లో వివాదం... స్నేహితురాలి ప్రా ణం తీసేలా చేసింది... 16 ఏళ్ల యువతి అత్యంత కర్కశంగా తన స్నేహితురాలిని కత్తితో 65సార్లు పొడిచి హత్య చేసింది.. ఈ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఎరాండీ ఎలిజబెత్, అనెల్ బెయిజ్ ఇద్దరు ప్రాణస్నేహితులు... అనెల్ బెయిజ్ తన ఫేస్‌బుక్‌లో ఎలిజబెత్‌తో కలసి దిగిన న గ్న చిత్రాలను పెట్టడంతో వివాదం మొదలైంది. దీని పై తీవ్రంగా ఆగ్రహించిన ఎలిజబెత్ ‘ నేను మౌనం గా ఉన్నట్టు కనిపిస్తుండొచ్చు..కానీ, నా మదిలో ఇప్పటికే నిన్ను మూడు సార్లు హత్య చేశా’అని బెయిజ్ నుద్దేశించి ట్వీట్ చేసింది.
కానీ, ఈ విషయాన్ని లైట్ తీసుకున్న బెయిజ్.. ఎలిజబెత్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఎలిజబెత్ అత్యంత దారుణంగా కత్తితో బెయిజ్‌పై దాడికి దిగింది. ఏకంగా 65 సా ర్లు కత్తితో పొడవడంతో బెయిజ్ అక్కడికక్కడే చని పోయింది. ఆ తర్వాత హత్యకు సంబంధించి ఎ లాంటి ఆధారాలు దొరకకుండా రక్తపు మరకలున్న బట్టలు, కత్తిని శుభ్రం చేసేందుకు ఎలిజబెత్ ప్రయత్నించింది. కానీ, చివరకు పోలీసులకు చిక్కింది.