స్ట్రాస్‌బర్గ్: క్రిస్మస్ పండుగ వేళ ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో రద్దీగా ఉండే ఓ వీధిలో బుధవారం ముష్కరుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. క్రిస్మస్ పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్న సమయంలో అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 12మంది గాయపడ్డారు. ఇది ఉగ్రవాద ఘటనేనని ఫ్రాన్స్ పోలీసులు ధ్రువీకరించారు.
స్ట్రాస్‌బర్గ్‌లోని రద్దీగా ఉన్న ఓ వీధిలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడని, కాల్పులు జరిపే సమయంలో అతడు ‘అల్లాహో అక్బర్’ అని నినాదాలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని ఇప్పటివరకు షెరీఫ్ సీ గా గుర్తించారు. అతడికి నేరచరిత్ర, రాడికల్ భావజాలం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment