మలేషియాలో భారీ భూకంపం
కౌలాలంపూర్: ఆగ్నేయ ఆసియాలోని మలేషియాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూతలానికి 10 కీలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గ నమోదయింది. మొదట భూకంపాన్ని యూఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. అయితే దీనివల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, మలేషియా ప్రభుత్వం సునామి హెచ్చరికలు జారీచేయలేదు.