తెరవకుండానే చదివేస్తుంది! | Super Robo | Sakshi
Sakshi News home page

తెరవకుండానే చదివేస్తుంది!

Published Sun, Sep 11 2016 3:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

తెరవకుండానే చదివేస్తుంది!

తెరవకుండానే చదివేస్తుంది!

రోబో సినిమాలోని చిట్టి తరహా రోబోట్‌ని నిజ జీవితంలో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. పుస్తకంలో పేజీలు తెరవకుండానే అందులోని విషయాలను తెలుసుకునేందుకు ఓ వినూత్నమైన స్కానర్‌ను తయారు చేశారు. ఇది దాదాపు 9 పేజీల కట్టలో ఉండే అక్షరాలను ఒకేసారి గుర్తించగలదు. మైక్రో తరంగాలు, పరారుణ కాంతికి మధ్యలో ఉండే టెరాహెర్జ్ రేడియోధార్మికత సాయంతో ఈ స్కానర్ పనిచేస్తుంది.

కాగితానికి, దానిపై ఉన్న అక్షరాలకు మధ్య ఉన్న తేడాలను ఈ కాంతి గుర్తించగలదు. 2 కాగితాల మధ్య ఉండే సూక్ష్మమైన గాలిపొర ద్వారా ఈ టెరాహెర్జ్ కాంతి ప్రసారమైనప్పుడు వచ్చే మార్పులను సెన్సార్ల ద్వారా గుర్తిస్తారు. ఈ వ్యవస్థ పనిచేసేందుకు అవసరమైన కంప్యూటర్ అల్గారిథమ్స్‌ను ఎంఐటీ, జార్జియా టెక్  శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement