సింగపూర్: సింగపూర్ తొలిప్రధాని లీ కువాన్ యూ నాయకుల్లో సింహంలాంటివారని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతి ఒక్క నాయకుడు ఆయనను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత కొద్ది కాలంగా న్యూమోనియా కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లీ కువాన్ యూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 1923 సెప్టెంబర్ 16న జన్మించిన ఆయన ఆసియా రాజకీయాల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయనను ఆధునిక సింగపూర్ పితామహుడిగా అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. ఆగ్నేయాసియాలోని పలు దేశాలతో ఆయన ఎన్నో మైత్రి సంబంధాలు నెలకొల్పి అన్ని రంగాల్లో సింగపూర్ దూసుకెళ్లేలా కృషిచేశారు.
చైనాకు చెందిన ఓ ధనికుల కుటుంబంలో జన్మించిన ఆయన పాఠశాల విద్యాభ్యాసం సింగపూర్లో న్యాయ విద్యను బ్రిటన్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పూర్తి చేశారు. సామ్యవాద సిద్ధాంతాన్ని నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు వెళ్లి సింగపూర్ తొలి ప్రధాని అయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాల ముఖ్య నేతలు ఆయనకు సంతాపం ప్రకటిస్తూ.. ప్రపంచ రాజకీయాలకు గొప్ప దిక్సూచిలాంటివారని కొనియాడారు. నివాళులర్పించినవారిలో భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నారు. లీ కువాన్ యూ సింహంలాంటి వారని మోదీ కొనియాడారు.
'లీ' నాయకుల్లో సింహం: మోదీ
Published Mon, Mar 23 2015 11:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM
Advertisement