
రోజూ ఆరు కప్పుల కాఫీ తాగితే...
రోజూ 6 కప్పుల కాఫీ తాగితే ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టొచ్చని పరిశోధనలో తేలింది. ఫ్యాటీ లివర్‌పై మచ్చలు పడే వ్యాధిని (ఫైబ్రోసిస్) కూడా కాఫీ నియంత్రిస్తుందని ఇటలీ పరిశోధకులు చెప్పారు.
లండన్: రోజూ 6 కప్పుల కాఫీ తాగితే ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టొచ్చని పరిశోధనలో తేలింది. ఫ్యాటీ లివర్‌పై మచ్చలు పడే వ్యాధిని (ఫైబ్రోసిస్) కూడా కాఫీ నియంత్రిస్తుందని ఇటలీ పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధనను 12 వారాల పాటు చిట్టెలుకలపై చేశారు.
ఎలుకలకు కొవ్వు పట్టేలా ఆహారంతో పాటు కెఫైన్ తీసేసిన కాఫీ ఇచ్చారు, మరికొన్నింటికి కాఫీ ఇవ్వలేదు. కాఫీ తాగిన ఎలుకలు తాగని వాటికన్నా తక్కువ బరువు పెరిగినట్లుగా గుర్తించారు. వాటిలో కొలెస్ట్రాల్ స్థాయులు, కాలేయ కణాల్లో కొవ్వు పరిమాణం తగ్గినట్లు తెలిపారు.