డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : ‘టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017’ ను తిరస్కరించాలని తాను నిర్ణయించుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ట్వీట్లు చేశారు. ఈ ఏడాది కూడా తానే టైమ్స్ పర్సన్‌గా ఎంపిక అవుతాననే సమాచారం అందినట్లు చెప్పారు. మేగజీన్‌పై ఫొటో కోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయాల్సివుంటుందని, అది తనకు ఇష్టం లేదని అన్నారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017ను అవార్డును తాను స్వీకరించబోనని చెప్పారు.
టైమ్స్ తదితర మేగజిన్స్ కవర్‌లపై కనిపించేందుకు ట్రంప్ తెగ ఉబలాటపడిపోయిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. 2015 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా తనను ఎంపిక చేయనందుకు ట్రంప్ టైమ్స్‌పై ఫైర్ అయ్యారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2016గా ట్రంప్ ఎంపికైన విషయం తెలిసిందే. కాగా, ట్రంప్ ట్వీట్లపై స్పందించిన టైమ్స్ అవార్డును ఇచ్చేందుకు అనుసరించే విధానం గురించి తెలియకుండా అధ్యక్షుడు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించింది.
టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2017పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని పేర్కొంది. కాగా, ఈ ఏడాది టైమ్స్ పర్సన్ ఆఫ్ ఇయర్‌ను టైమ్స్ మేగజీన్ వచ్చే నెల ఆరో తేదీన ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment