రూ. 400 కోసం ప్రాణాలే పణంగా...
మొసలి నోట్లో తలపెట్టి ఏమాత్రం భయపడకుండా చాలా రిలాక్స్‌గా హాయ్ చెబుతున్న ఈమెను చూడండి. ఏ రికార్డుల కోసమో ఈ సాహసకృత్యం చేయడంలేదు. థాయ్‌లాండ్‌లోని ఓ జూకి వచ్చే సందర్శకులను అలరించేందుకు ఈ యువతి ఇలా తన ప్రాణాల్నే పణంగా పెడుతోంది.
రోజంతా ఇలా మొసళ్లతో ప్రమాదకరమైన క్రీడ నిర్వహిస్తున్నం దుకు ఈమెకు దక్కేది ఎంతో తెలుసా? కేవలం నాలుగు పౌండ్లు. అంటే దాదాపు రూ. 400 అన్నమాట. ఈమెతోపాటు మరో యువకుడు కూడా ఈ ప్రమాదకర ఆటకు సై అంటున్నాడు. అతడు మొసలి ముఖంపై ఇలా ముద్దు పెట్టి ఔరా అనిపిస్తున్నాడు. కూటి కోసం ఎన్ని తిప్పలో..?