ప్రమాద స్థలంలో సహాయ సిబ్బంది
పారిస్: అప్పటివరకు సజావుగా సాగిన వారి ప్రయాణం అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగింది. కారులో లోపమేంటో గుర్తించి స్టార్ట్ చేసేలోగా వేగంగా దూసుకొచ్చిన రైలు కారును ఢీకొట్టింది. పట్టాల రాపిడితో మంటలు చెలరేగాయి. అలా కొద్ది మీటర్ల దూరం వెళ్లిన తర్వాతగానీ రైలు ఆగలేదు. ఫ్రాన్స్ లోని ఓర్నే రీజియన్ లో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో మహిళ గాయాలతో తప్పించుకుంది.
లీమన్స్ నుంచి పారిస్ వెళుతోన్న లోకల్ రైలు తన మార్గంలోని ఓ లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలపై నిలిచిఉన్న కారును ఢీకొట్టిందని, ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది.. మంటలను ఆర్పివేసి మృతదేహాలను వెలికితీశారని, శిధిలాలను కూడా తొలగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో కొద్ది గంటలపాటు రవాణా నిలిచిపోయింది.