rails
-
కాసుల కోసం భూ రికార్డులు తారుమారు
వరదయ్యపాళెం: డబ్బులకు ఆశపడి డీకేటీ పట్టాలను అక్రమంగా వేరేవాళ్ల పేర్ల మీదకు మార్చేసిన పలువురు రెవెన్యూ అధికారులపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని చిన్న పాండూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 95/4, 96/1, 88/8లలో టి.వెంకటేష్ పేరిట 1.5 ఎకరాలకు, ఎం.రంగమ్మ పేరిట 1.5 ఎకరాలకు, కె.కన్నయ్య పేరిట 1.5 ఎకరాలకు 1992 ఏప్రిల్ 9న డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవే భూములను 2005లో అక్రమంగా పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మల పేరిట కూడా రికార్డు చేసి.. పట్టాలిచ్చారు. అనంతర కాలంలో అపోలో టైర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతంలోని 216 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 251.24 ఎకరాలను కేటాయించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మలకు సి కేటగిరి కింద పరిహారం అందింది. అయితే తమకు ఏ కేటగిరి కింద రూ.6.5 లక్షల పరిహారమివ్వాలని వారు కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారించిన హైకోర్టు పట్టాల మంజూరులో జరిగిన అవకతవకలను గుర్తించి.. గతేడాది కలెక్టర్‌ను విచారణకు పిలిపించింది. న్యాయస్థానం ఆదేశాలతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి అక్రమాలను గుర్తించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ పేరిట అక్రమంగా పట్టాలిచ్చినందుకు అప్పటి ఇన్చార్జ్ తహసీల్దార్ మహదేవయ్య, ఆర్ఐ సదాశివయ్య, స్థానిక వీఆర్వో రఘునాథరెడ్డిలపై కేసు నమోదు చేశారు. రాపూరు నాగమ్మ పేరిట అక్రమంగా పట్టా ఇచ్చినందుకు అప్పటి మండల తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, అప్పటి ఆర్ఐ మురళీమోహన్, ప్రస్తుత చిలమత్తూరు వీఆర్వో దొడ్డి వెంకటరమణపై కేసు నమోదైంది. -
అధికారంలోకి వస్తే పోడు పట్టాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు పట్టాలు అందిస్తానని ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అదివాసీ వర్గీకరణకు తమ పార్టీ కృషి చేస్తుందని హామీనిచ్చారు. సోమవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల మాట్లాడారు. జల్, జంగల్, జమీన్ కోసం గోండు నాయక్, కొమురం భీం మొదలుకొని నేటి దాకా ఆదివాసీలు పోరాడుతూనే ఉన్నారని, పదేళ్లుగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో 21 మంది మహిళలపై కేసులు పెట్టి జైలులో హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 అటవీచట్టం ఎంతో అద్భుతమని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ చట్టాన్ని మాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం గత ఏడేళ్లుగా గిరిజనులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్ హయంలో 3.30 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ బాధితులకు ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాల్లేవని పేర్కొన్నారు. తెలంగాణలో కనీసం 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన వాటికి కూడా విలువలేదని, వాటికి కూడా హక్కులు కల్పించలేమని, పట్టాలు ఉన్నా కూడా రైతుబంధు, రైతు బీమా ఇవ్వలేమని చెప్పడాన్ని షర్మిల ఆక్షేపించారు. ‘మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డగా చెబుతున్నాను, వైఎస్ఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్లుగానే తాము కూడా ఆదివాసీ గిరిజనులను గౌరవించి వారికి పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీ వర్గీకరణకు కృషి చేస్తాన్నారు. -
గిరిజనులకు ‘పట్టా’భిషేకం
సీతంపేట: ఎన్నో ఏళ్లుగా అటవీసాగు హక్కు పత్రాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనానికి మరికొద్ది రోజు ల్లో మేలు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులకు అటవీ సాగు హక్కు కలి్పంచాలనే సంకల్పంతో ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 12 ఏళ్ల క్రితం పంపిణీ జరిగింది. అనంతరం మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్ఓఎఫ్ఆర్ (రిజర్వ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఐటీడీఏ పరిధిలో సబ్‌ప్లాన్ మండలాల్లో 3,336 ఎకరాల్లో 2 వేల 97మందికి అటవీసాగు హక్కు పత్రాలు అందనున్నాయి. ఈ దిశగా అటవీశాఖ, ఐటీడీఏ కసరత్తు చేస్తోంది. టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అటవీచట్టానికి ప్రస్తుత ప్రభుత్వం జీవం పోస్తోంది. అటవీప్రాంతంలో సాగు చేసే గిరిజన రైతులకు సాగు హక్కు పత్రాలు ఇచ్చి వారికి అన్ని రకాల హక్కులు కలి్పంచడానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీహక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2005కు ముందు సాగు హక్కులో ఉన్నవారందరికీ పట్టాలు ఇవ్వాల్సి ఉంది. దీనిప్రకారం గతంలో రెండుసార్లు పట్టాలు ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అందరికీ న్యాయం జరగలేదనే ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని నీరు గార్చిందనే ఆరోపణలున్నాయి. ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. వీటి పరిధిలో 301 గ్రామ పంచాయతీలుండగా 1406 గ్రామాలున్నాయి. సుమారు 40 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు దాదాపు 10 వేలు ఉంటాయి. కొంతమందికి సాగు చేసుకోవడానికి పట్టాలు వంటివి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా సాగుపై హక్కులు లేకపోవడం, సకాలంలో రుణాలు పొందలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున సాగుహక్కు పత్రాలు ఇవ్వనున్నారు. పట్టాల తయారీ వంటివాటిపై ఇప్పటికే ఐటీడీఏలో కసరత్తు జరుగుతోంది. గిరిజనులకు రుణాలు ఈ పట్టాల ద్వారా గిరిజనులు బ్యాంకుల్లో రుణాలు సైతం పొందవచ్చు. తద్వారా పంటలు పండించుకోడానికి అవకాశమేర్పడుతుంది. పోడు వ్యవసాయం వల్ల అడవులు దెబ్బతింటున్నాయని అటవీశాఖ ఎప్పుడు పడితే అప్పుడు అడ్డుకుంటోంది. అడవిని నమ్ముకుని బతికే గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద పట్టాలు ఇవ్వడంతో పోడు వ్యవసాయానికి ఇక అడ్డంకులు ఉండవు. హక్కు పత్రాలు ఉంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులు కూడా ఉండవు. గతంలో ఏనుగులు వంటివి పంటలను నష్టపరిస్తే పరిహారం వచ్చేది కాదు. పట్టా చేతికి వస్తే పరిహారం కూడా వస్తుంది. ఇదీ పరిస్థితి... మండలాల వారీగా అటవీసాగు హ క్కు పత్రాలు ఇవ్వడానికి ఇప్పటికే జాబితా సిద్ధమైంది. కొత్తగా ఎవరై నా దరఖాస్తులు ఇస్తే వాటిని కూడా స్వీకరిస్తున్నారు. మా కష్టాలు తీరనున్నాయి నాకు రెండు ఎకరాలకు పైగా కొండపోడు వ్యవసాయం ఉంది. దానిపై పూర్తిగా హక్కు లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా ను. భర్త మృతి చెందడంతో కూలీనాలీ చేసు కుని బతుకుతున్నాను. పట్టా వస్తే రుణం కూడా వస్తుంది. పంట లు పూర్తిగా పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవచ్చు. –సవర లక్ష్మి, అక్కన్నగూడ పట్టాల పంపిణీకి చర్యలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు అటవీ సాగు హక్కు పత్రాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాగు హక్కు పత్రాల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ వేగవంతం చేశాం. 2 వేల పైచిలుకు పట్టాలు ఇవ్వడానికి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదమైంది. అలాగే మరో 500 వరకు దరఖాస్తులు వచ్చాయి. అవి పరిశీలనలో ఉన్నాయి. –సందీప్ కృపాకర్, జిల్లా అటవీశాఖాధికారి సీఎం జగన్ గిరిజనుల పక్షపాతి గిరిజనులకు సాగు హక్కు పత్రాలు లేని వారందరికీ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఆయన గిరిజనుల పక్షపాతి. అటవీసాగు హక్కు పత్రాలు వస్తే గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజనులకు అన్యాయం జరిగింది. –విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
చల్లని కబురు చెప్పిన భారత వాతావరణ విభాగం
-
మాజీ సైనికుల పేరిట దోచేశారు!
సాక్షి, విశాఖపట్నం : మాజీ సైనికులను పుట్టించారు. వారి పేరిట ఎప్పుడో పట్టాలు పొందినట్టుగా రికార్డులు సృష్టించారు. దర్జాగా ఎన్వోసీలు సంపాదించారు. వాటిని అడ్డంపెట్టుకుని తమ పేరిట మార్చేసుకున్నారు. వందల కోట్ల విలువైన భూములను కాజేశారు. మాజీ సైనికుల పేరిట విశాఖ కేంద్రంగా సాగిన భూకబ్జాలు జిల్లా వాసులనే కాదు.. రాష్ట్ర ప్రజలనే నివ్వరపోయేలా చేశాయి. అడ్డగోలు ఆర్డర్లే కాదు.. లేని వార్ని ఉన్నట్టుగా చూపించి పట్టాలు సృష్టించడంలో కానీ. వాటికి అడ్డంపెట్టుకుని ఎన్వోసీలు జారీ చేయించడంలో మన వాళ్లు అందవేసిన చేయి. అధికారులను అడ్డంపెట్టుకుని వందల.. వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడంలో అధికార టీడీపీ నేతలు లీలలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ఇవి కొన్ని మచ్చుతునకలే. విశాఖపట్నం రూరల్ మండలం(చినగదిలి) కొమ్మాదిలో సర్వే నంబర్ 28/2లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ సుమారు 150 కోట్లు పైమాటే. ఈ భూమిని దాకవరపు రాములు అనే స్వాతంత్య్ర సమరయోధుడు పేరిట 1978 జూన్ 8న విశాఖపట్నం రూరల్ మండల తహశీల్దార్ జారీ చేసినట్టుగా పట్టా పుట్టించారు. ఆయన చనిపోయారని చూపిస్తూ అతని కుటుంబ సభ్యుల నుంచి 7.68 ఎకరాలను రూ.6.02 కోట్లు చెల్లించి హైదరాబాద్‌కు చెందిన జి.శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేశారు. ఈ మేరకు మధురవాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నెం. 4439/2012గా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మిగిలిన 2.50 ఎకరాల భూమిని విశాఖకు చెందిన ఎం.సుధాకర్‌రావు పేరిట రిజిష్టరు చేయించారు. ఈ బాగోతంపై లోతైన పరిశీలన చేయగా అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. 1983 వరకు తాలూకా వ్యవస్థ ఉండేది. ఎన్టీఆర్ హయాంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే దాకవరపు రాములుకు 1978లోనే రూరల్ మండల తహశీల్దార్ జారీ చేసినట్టుగా పట్టా పొందడం, ఇదే విషయాన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 346/87లో కూడా చూపడంతో ఈ బాగోతం బండారం బట్టబయలైంది. పైగా ఈ డాక్యుమెంట్లో పేర్కొన్న రాములు కుమారులు, కుమార్తెలంతా విశాఖపట్నం ఎండాడ గ్రామంలోని ఇంటి నెం.1–55 డోర్ నంబర్లో నివాసముంటున్నట్లు పేర్కొనగా, ఆ ఇంట్లో ఆ పేరు గలవాళ్లే లేరని తేలింది. దాకవరపు రాములు వారసులమని చెప్పి సేల్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన దాకవరపు సత్యారావు తదితరులపై విచారణ చేశారు. సిట్‌కు ఫిర్యాదుల వెల్లువ ఈ భూమిలోని 7.68 ఎకరాలు జీపీఏ ద్వారా పొందిన జి.శ్రీనివాసరెడ్డిని, 2.50 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఎం.సుధాకర్‌రావును క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ సిట్‌కు ఫిర్యాదు చేశారు. సీపీఐతో పాటు వైఎస్సార్ సీపీ ఇతర విపక్షాలన్నీ ఈ భూబాగోతంపై సిట్‌కు ఫిర్యాదులు కూడా చేశాయి. ఎన్వోసీలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన సిట్ 69ఎన్‌వోసీల్లో ఇదొక తప్పుడిదిగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అసలు ఈ భూమిని ఏ మాజీ సైనికుడికి కేటాయించలేదని సిట్ దర్యాప్తులో తేటతెల్లమైందని తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్నీ రద్దు చేయడమే కాకుండా ఇందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయినా కొమ్మాదిలో నకిలీ ఎన్వోసీ ద్వారా కొనుగోలు చేసిన భూముల చుట్టూ ఇంకా ప్రహరీ మాత్రం కూల్చే సాహసం చేయలేడం లేదు. ఆ భూములను అధికారులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. కారణం సిట్ దర్యాప్తు వెలుగులోకిరాకపోవడమే. సిట్ నివేదిక వెలుగులోకివస్తే కానీ కబ్జారాయుళ్ల చేతిలో ఉన్న ఇలాంటి వందల కోట్ల విలువైన భూములు వారి చెర నుంచి బయట పడే సూచనలు కన్పించడం లేదు. -
చిగురించిన ఆశలు
విజయవాడలోని రెవెన్యూ, కొండ పోరంబోకు స్థలాలకు పట్టాలు పొంది, వాటిలో నివసిస్తున్న పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకూ స్థలాలకు పట్టాలు ఉన్నా అధికారికంగా క్రయవిక్రయాలకు, తనఖాపై రుణాలు పొందేందుకు వీలు లేదు. ఇప్పుడు విక్రయాలకు, తనఖాలకు అవకాశం కల్పిస్తూ జీఓ తెచ్చేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టడంతో పేదలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, విజయవాడ: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ సమయంలో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి ఏకరువుపెట్టారు. కొండప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, వాటి వల్ల ఉపయోగం లేకుండాపోయిందని వివరించారు. కుటుంబ అవసరాల కోసం ఇళ్లు విక్రయించాలన్నా, కనీసం బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకోవాలన్నా వీలులేదని వివరించారు. సీఎం స్పందించి పేదల ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక జీఓ వస్తేనే సాధ్యం ప్రస్తుతం ఉన్న జీఓల ప్రకారం ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించుకుని నివసిస్తున్న ఇళ్లకు సంబంధించి పట్టాలు ఉన్నప్పటికీ విక్రయించుకునే అధికారం లేదు. గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినా కేవలం అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ఈ తరహాలో సుమారు 50 వేల ఇళ్ల వరకు రెవెన్యూ భూముల్లో, కొండలపైనా ఉన్నాయి. పట్టాల మార్పుపై పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా, అందుకు ప్రస్తుతం ఉన్న జీఓలు సరిపోవని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర భూపరిపాలన శాఖ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇళ్ల పట్టాలను మార్చి వాటి స్థానంలో, ఇళ్ల స్థలాన్ని విక్రయించేందుకు (సేలబుల్ రైట్స్), బ్యాంకులో తాకట్టు(లోన్లు) పెట్టి రుణం తీసుకునేందుకు వీలుగా కొత్త పట్టాల జారీ చేసేందుకు ప్రత్యేక జీఓ జారీ చేయాలని కోరినట్లు తెలిసింది. చేతులు మారిన స్థలాల విషయంలో... కొండ ప్రాంతం, పోరంబోకు భూముల్లో పేదలు నివసిస్తున్న స్థలాలకు పట్టాలు ఉన్నా విక్రయించే హక్కు లేదు. అయితే కొంతమంది తమ ఇళ్లను విక్రయించుకున్నారు. కొనుగోలుదారుడికి ఇంటి పట్టా అందజేసి, ఇంటిని స్వాధీనం చేస్తూ హామీ పత్రం రాసిచ్చేవారు. అయితే పట్టా మాత్రం విక్రయదారుడి పేరుతోనే ఉండేది. ఇటువంటి వాటిని కూడా మార్చేందుకు వీలుగా జీఓలో మార్గదర్శకాలు పొందుపరచాలని రెవెన్యూ అధికారులు భూపరిపాలన శాఖను కోరారు. చనిపోయిన వారి పేరుతో పట్టాలు ఉంటే, ప్రస్తుతం అనుభవిస్తున్న వారి పేర్లతో కొత్తగా పట్టాలు ఇచ్చేందుకు వీలుగా నిబంధనలు రూపొం దించాలని కూడా కోరినట్లు తెలిసింది. విద్యుత్ బిల్లులు, కార్పొరేషన్‌కు చెల్లించే ఇంటి పన్ను రశీదులను ఆధారంగా చేసుకుని అనుభవదారులను గుర్తించాలని సూచిం చారు. కొత్త పట్టాలు పొందిన వారు కనీసం రెండేళ్ల వరకు విక్రయించకుండా, బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా మార్గదర్శకాల్లో పొందుపరచాలని కోరారు. ప్రత్యేక జీవో విడుదలయ్యేనా? ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు అవసరమైన ప్రత్యేక జీఓ జారీ సాధ్యమేనా అనే చర్చ రెవెన్యూ శాఖలో జరుగుతోంది. కొండపైన ఉన్న ఇళ్లను విక్రయించేందుకు హక్కు కల్పించాలంటే అటవీశాఖ చట్టాలు అంగీకరించవేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ జీఓ వస్తే కొండలపైన మరిన్ని ఆక్రమణలు పెరిగే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు అవకాశం ఇస్తే అక్కడ భూముల ధరలు కొండెక్కి కూర్చుంటాయని భావిస్తున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్..
బిహార్: బిహార్‌లోని గయ వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కైమూర్ గయ ముగల్‌సరాయ్ మార్గంలో 14 గూడ్సు వ్యాగన్లు పక్కకు ఒరిగాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. -
పట్టాలు సరే.. స్థలాలు ఎక్కడ?
- రెవెన్యూ అధికారులకు లబ్ధిదారుల ప్రశ్న - కలకలం రేపిన వికలాంగుడిఆత్మహత్యాయత్నం - జిల్లావ్యాప్తంగా 10వేలకుపైగా బాధితులున్నట్లు అంచనా కర్నూలు(అగ్రికల్చర్): తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకుచావండి అన్నట్టుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు. రాజకీయ నాయకుల నుండి వచ్చే సిఫార్సులు, ఇతరత్రా వచ్చే ఒత్తిళ్లకు లొంగి పేదలకు హడావుడిగా ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇస్తున్నారు.. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ పట్టాలకు సంబంధించిన స్థలాలు మాత్రం చూపడంలేదు. ఈ విషయంలో ఒక్కరు, ఇద్ద రు కాదు... వేలాదిగా లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నా అధికారుల తీరులో మార్పులేకపోవడం గమనార్హం. కల్లూరు మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన వికలాంగుడు రాముడికి పట్టా ఇచ్చినప్పటికీ స్థలం చూపడంలో కల్లూరు తహశీల్దార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గత సోమవారం కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందిం చిన కలెక్టర్ వెంటనే అతనికి ఇంటి స్థలం చూపించాలని కర్నూలు ఆర్డీఓ, కల్లూరు తహశీల్దార్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆగమేఘాల మీద ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రాముకు ఇంటిస్థలం చూపారు. అయితే ఈ సమస్య రాము ఒక్కడిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా 10వేల మంది ఉంటారని అంచనా. నగరంలోనే దాదాపు 5వేల మంది ఉన్నట్లు సమాచారం. 2009 వరదల కారణంగా.. 2009లో కర్నూలుకు వరదలు రావడంతో పునరావాసం కింద నగరవాసులకు కల్లూరు మండలం తడకనపల్లి, కర్నూలు మండలం రుద్రవరంలో ఇంటి స్థలాలు కేటాయించారు. సుమారు 50వేల మందికి 2011లో అప్పటి చిన్ననీటి పారుదలమంత్రి టీజీ వెంకటేష్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీదు ఈ పని చేశారు. నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లబ్ధిదారులు మాత్రం పట్టాలు చేతపట్టుకుని స్థలాలు చూపాలంటూ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా తడకనపల్లి, రుద్రవరంలో కర్నూలు, కల్లూరు వాసులకు పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపాలని ఏడాది నుంచి కోరుతున్నారు. కానీ అధికార యంత్రాంగం చెవికెక్కించుకోలేదు. - కల్లూరు మండలం తడకనల్లిలో 2011లో సర్వే నెం. 337, 338లో కర్నూలుకు చెందిన వేలాది మందికి పట్టాలు ఇచ్చారు. - కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెం దిన 1000మంది సర్వేనెంబరు 277లో, 2013లో ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇచ్చారు. - కర్నూలు మండలం రుద్రవరంలో నగరానికి చెందిన 2వేల మందికి 2012లో పట్టాలిచ్చారు. -
పట్టాలపాలైన ప్రాణాలు..
పారిస్: అప్పటివరకు సజావుగా సాగిన వారి ప్రయాణం అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగింది. కారులో లోపమేంటో గుర్తించి స్టార్ట్ చేసేలోగా వేగంగా దూసుకొచ్చిన రైలు కారును ఢీకొట్టింది. పట్టాల రాపిడితో మంటలు చెలరేగాయి. అలా కొద్ది మీటర్ల దూరం వెళ్లిన తర్వాతగానీ రైలు ఆగలేదు. ఫ్రాన్స్ లోని ఓర్నే రీజియన్ లో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో మహిళ గాయాలతో తప్పించుకుంది. లీమన్స్ నుంచి పారిస్ వెళుతోన్న లోకల్ రైలు తన మార్గంలోని ఓ లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలపై నిలిచిఉన్న కారును ఢీకొట్టిందని, ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది.. మంటలను ఆర్పివేసి మృతదేహాలను వెలికితీశారని, శిధిలాలను కూడా తొలగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో కొద్ది గంటలపాటు రవాణా నిలిచిపోయింది. -
‘పోడు’దారులందరికీ పట్టాలివ్వాలి
- రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ రాంపురంలో పోడు - సాగుదారులతో సమీక్ష రాంపురం(కొణిజర్ల) : ఏళ్లతరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని రిటైర్డ్ హైకోర్డు జడ్జి చంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలోని రాంపురం గ్రామంలో ఆయన శుక్రవారం పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సాగుదారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. తాము సాగు చేసుకుంటున్న భూములను బిడ్డలకు వరకట్నంగా ఇస్తే.. ఇప్పు డు ఆ భూములు ప్రభుత్వం లాగి వేసుకుంటుం దని, దీంతో తమ అల్లుళ్లు బిడ్డలను ఇళ్ల వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న తమకు భూమి లేకుం డా చేయాలని అధికారులు, ప్రభుత్వం చూస్తుం దన్నారు. అనంతరం చంద్రకుమార్ మాట్లాడుతూ 30,40 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఎంతో మంది పట్టాలు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆలోచించకుండా భూములు లాగేసుకోవాలని ప్రయత్నించడం దారుణమన్నారు. హరితహా రం పేరుతో మొక్కలు నాటడానికి గిరిజనులు వ్యతిరేకం కాదన్నారు. వాతావరణ కాలుష్యం ఏర్పడటానికి కార్పొరేట్ సంస్థలు, వాటి కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం తప్ప నిత్యం మొక్కల మధ్య బతికే గిరిజనులు కాదన్నారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ ప్రకృతిని కాపాడటానకి గిరిజనులపై యుద్ధం వద్దన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటున్న వారి ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం వల్లే ప్రజ లకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. రాబో యే ఎన్నికల్లో కాంట్రాక్టర్ల ప్రతినిధులను, డబ్బు కు ఆశపడే వారిని ఎన్నుకోవద్దన్నారు. నిరుపేదల పక్షాన నిలబడి ైధె ర్యంగా పోరాడే వారిని గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ మనసు కరి గించడానికి గ్రామాల్లో ప్రతి టీఆర్ఎస్ ముఖ్య నాయకుడికి పోడు సాగుదారులు తమకు పట్టాలు ఇప్పించాలని దరఖాస్తులు ఇవ్వాలన్నారు. వారే తమ నాయకుడితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారు భయపడాల్సిన పని లేదన్నారు. ధైర్యంగా ఉండి భూములు సాగు చేసుకోవాలన్నారు. గిరి జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ ధర్మా, ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, పోడు భూము ల పరిరక్షణ కమిటీ సభ్యులు బొంతు రాంబా బు, భూక్యా వీరభద్రంనాయక్, తాళ్లపల్లి కృష్ణ, రైతు సంఘం మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరావు, ఐలూ, వి.లక్ష్మీనారాయణ, చింతనిప్పు చలపతిరావు, శాగం కృష్ణారెడ్డి, బానోత్ భరత్, డి.రామ్మూర్తి పాల్గొన్నారు. -
విరిగిపడిన కొండ చరియలు
- కేకే లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం - విశాఖ-కిరండూల్ పాసింజర్ రద్దు అరకులోయ/అనంతగిరి: కొత్తవలస-కిరండూల్ రైలు మార్గంలో పట్టాలపై గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. అనంతగిరి మండలం శిమిలిగుడ స్టేషన్ సమీపంలోని 82/15 నుంచి 82/17 మైలు రాయి మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టాలపై రాళ్లు, మట్టిపేరుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో ఉన్న తిరుపతి అనే ఉద్యోగి దీనిని గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ప్రత్యేక రైలులో సంఘటన స్థలానికి అధికారులు ఎకాయెకిన చేరుకున్నారు. రెండు పొక్లెయినర్లను రప్పించి పట్టాలపై పేరుకుపోయిన రాళ్లు, మట్టి తొలిగించారు. విశాఖ నుంచి కిరండూల్ వెళ్తున్న గూడ్స్ రైలును వెనక్కి మళ్లించారు. కిరండూల్ నుంచి శిమిలిగుడ వరకు పలు గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలును శుక్రవారం రద్దు చేశారు. సాయంత్రానికి కొండచరియలను తొలిగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఏటా ఇదే సమస్య: వర్షాలప్పుడు కేకేలైన్‌లో ఏటా ఇదే పరిస్థితి చోటుచేసుకుంటోంది. రైల్వే శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వర్షాకాలం వచ్చిందంటే కరకవలస నుంచి బొడ్డవర రైల్వే స్టేషన్ వరకు ఏదో ఒక చోట ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారుతోంది. గతేడాది డిసెంబర్లో ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి కిరండూల్ పాసింజర్ రైలు ప్రయాణికులు నరకయాతనకు గురయ్యారు. ఈనెల 17వ తేదీ బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి విశాఖ నుంచి దమన్‌జోడి వెళుతున్న గూడ్స్ రైలు బోగి పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి గతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అటువంటి ముందస్తు చర్యలు చేపట్టినట్టు లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి అటువంటి ప్రాంతాలను గుర్తించి వర్షాకాలానికి ముందుగానే చర్యలు చేపడితే బాగుంటుందన్న వాదన ఉంది. -
పట్టాలు, పాస్‌పుస్తకాలు ఉంటే పరిహారం ఓకే
- సాగులో ఉండేవాటిపై చర్చించి నిర్ణయిస్తాం : ఆర్టీవో - ఎకరాకు రూ.10లక్షలు ఇవ్వాలని రైతుల డిమాండ్ శ్రీకాళహస్తి: రైతులకు పాస్‌పుస్తకాలు...పట్టాలు ఉంటే పరిహారం ఓకే.... ఇవే వీ లేకుండా రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పరిహారం ఇచ్చే విషయం పై మాత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మం అన్నారు. శ్రీకాళహస్తి మండలంలో భూ ముల సేకరణపై శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్టీవో వీరబ్రహ్మంతో పాటు తహశీల్దార్ చంద్రమోహన్ రైతులతో రెండోసారి సమావేశం నిర్వహిం చారు. రైతులు తమకు ఉన్న కొద్దిపాటి భూములు ఇచ్చేస్తే ఎలా బతకాలి అం టూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్డీవో వీరబ్రహ్మం మాట్లాడతూ గతం లో శ్రీసిటీ ఏర్పాటుకు రైతుల నుంచి భూములను ఉచితంగా సేకరించారు, ఇప్పుడు భూములకు డబ్బులు ఇస్తామని చెప్పినా సంకోచిస్తున్నారు ఎందు కు... అంటూ రైతులను ప్రశ్నించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు భూముల సేకరణను వ్యతిరేకించడం మాములే అంటూ రైతులకు తెలిపారు. డీకేటీ భూములు తీసుకునే హక్కు తమ కు ఉన్నా...ఆ భూములను అభివృద్ధి చేశారని ఉద్దేశంతో పరిహారం ఇస్తున్న ట్లు చెప్పారు. దీంతో రైతులు ఏర్పేడు మండలంలోని జంగాలపల్లి రైతులకు ప రిహారం ఇచ్చినట్టే తమకు ఇవ్వాలని కో రారు. ఏర్పేడు మండలంలో కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలు ఏర్పాటు చే స్తుండడంతో వారే పరిహారం ఇస్తారని...శ్రీకాళహస్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉం టుందని, ఏర్పేడు స్థాయిలో శ్రీకాళహస్తి మండలంలో పరిహారం చెల్లించడం కుదరదని తేల్చిచెప్పారు. పాస్‌పుస్తకాలు,పట్టాలు ఉన్నవారికి పరిహారం ఇస్తారని, ఇవిలేకుండా భూమిని సాగుచేసుకుంటున్న వారికి పరిహారం విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలి పారు. భూములున్న పలువురు రైతుల నుంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకుంటున్నామని, అయితే వారందరికీ పరిహారం ఇస్తున్నట్లు కాదని...ఆ భూ ములపై సమగ్ర విచారణచేసిన తర్వాత వారు అర్హులైతేనే పరిహారం వస్తుందని తెలిపారు. రైతులు భూములు ఇవ్వకపోతే ఫ్యాక్టరీలు బెంగ ళూరు,చెన్నై,హైదరాబాద్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే రైతులు చివరగా ఎకరానికి రూ.10లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే సెంటు భూమి ఇచ్చే ది లేద నిచెప్పారు. దీంతో ఆర్డీవో మరోసమావేశంలో పరిహారంపై చర్చలు జరిపి స్పష్టం చేస్తామని తెలిపారు. -
జీతాలు పెంచకుంటే రైళ్లు నడపం
బెర్లిన్: తమకు జీతాలు పెంచకుంటే రైళ్లు నడపబోమని జర్మనీ ట్రైన్ డ్రైవర్లు మొండికేశారు. ఇప్పటికే పలుమార్లు చెప్పామని, గత తొమ్మిది నెలల్లో తమ జీత భత్యాలు పెంచాలని ధర్నాకు దిగడం ఇది ఏడోసారని వారు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం మూడు గంటలనుంచి వారు పూర్తి స్థాయిలో రైళ్లు నడపకుండా ధర్నాకు దిగనున్నారు. ఇప్పటికే యాజమాన్యాలతో 16 రౌండ్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు రైలు డ్రైవర్ల సంఘం తెలిపింది. -
రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం
కరీంనగర్: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్రం ప్రభుత్వ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రైతులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కొత్త నిబంధనల విధానాల ద్వారా పంటనష్టం అంచనా వేయాల్సినవసరం ఉందని చెప్పారు. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.18వేలు, ఆహార పంటలకు ఎకరానికి రూ.13 వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారమే రాష్ట్ర సర్కార్ పంట నష్టం అందించాలని చెప్పారు. -
ప్రమాదాల నివారణకు ‘ట్రెస్ పాసింగ్’
- బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్లో పనులు ప్రారంభం - ఆ తర్వాత దశలలో మిగతా స్టేషన్లకు విస్తరిస్తామన్న అధికారులు సాక్షి, ముంబై: నగరంలో వివిధ రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటుతూ వేలాది మంది మృతి చెందుతుండడాన్ని రైల్వే శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రమాదాలను అరికట్టడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు రూ.130 కోట్ల వ్యయంతో ‘ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు’ను చేపట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ట్రాక్‌ల మధ్య రేలింగ్‌లు, పచ్చదనం పెంచడం, ఆర్సీసీ వాల్, గట్టర్లను ట్రాక్‌ల వెంబడి ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడతగా బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్లో ఇటీవలే పనులు ప్రారంభించారు. ‘రైలు ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా జరుగుతున్న 11 స్టేషన్లను గుర్తించాం. ఇక్కడ బారికేడ్లు నిర్మించినా ప్రయాణికులు వీటిని లెక్క చేయకుండా ముందుకెళ్లి ప్రమాదం బారినపడుతున్నారు. దీంతో వీటి ఎత్తును కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నామ’ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్నారు. ఈ 11 రైల్వే స్టేషన్లలో బారికేడ్లను ఏర్పాటుచేయడం ద్వారా 80 శాతం వరకు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతగా బోరివలి స్టేషన్లో రూ.14.5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వసైలో రూ.14.5 కోట్లు, నాలాసోపారాలో రూ.90 లక్షలు, కుర్లాలో రూ.8.1 కోట్లు, కన్జూర్మార్గ్లో రూ.8.1 కోట్లు, కల్యాణ్‌లో రూ.8.2 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు. కాగా, ఈ ప్రాజెక్ట్ పనులు మొదటి విడతగా బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్లలో ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ ఎమ్మార్వీసీ చేపట్టింది. ఆ తర్వాత కుర్లా, కల్యాణ్, వసై, నాలాసోపారా స్టేషన్లలో ప్రారంభించనున్నారు. రెండో విడతగా దాదర్, కాందివలి, బయంధర్, ఠాణే, ఠాకుర్లా స్టేషన్లలో ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టనున్నారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం టికెట్ వెండింగ్ మిషన్లు, వాటర్ కూలర్లు, ఔషధ దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఎస్కలేటర్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. రైల్వే చర్యలు శూన్యం... రైల్వే ప్లాట్‌ఫాంలు రద్దీగా ఉండడంతో సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం ప్రయాణికులు పట్టాలు దాటుతున్నారని తెలిసింది. రద్దీ సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై కూడా రద్దీ ఉండడంతో వేరే గత్యంతరం లేక పట్టాలు దాటుతున్నారు. రైల్వే స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు వసతులు కొరవడ్డాయి. ఎస్కలేటర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. చివరి క్షణంలో రైలును మరో ప్లాట్‌ఫాంపైకి మార్చినట్లు ప్రకటించడం కూడా ప్రమాదాలకు కారణంగా తేలింది. ప్రస్తుతం పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ల ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు వీటి మీది నుంచి దూకేస్తున్నారు.