బెర్లిన్: తమకు జీతాలు పెంచకుంటే రైళ్లు నడపబోమని జర్మనీ ట్రైన్ డ్రైవర్లు మొండికేశారు. ఇప్పటికే పలుమార్లు చెప్పామని, గత తొమ్మిది నెలల్లో తమ జీత భత్యాలు పెంచాలని ధర్నాకు దిగడం ఇది ఏడోసారని వారు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం మూడు గంటలనుంచి వారు పూర్తి స్థాయిలో రైళ్లు నడపకుండా ధర్నాకు దిగనున్నారు. ఇప్పటికే యాజమాన్యాలతో 16 రౌండ్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు రైలు డ్రైవర్ల సంఘం తెలిపింది.