కరోనాను అర సెకనులో గుర్తించే ‘డాగ్స్‌’ | Trained Pets Could Learn To Spot Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాను అర సెకనులో గుర్తించే ‘డాగ్స్‌’

Published Tue, Apr 14 2020 7:26 PM | Last Updated on Tue, Apr 14 2020 7:28 PM

Trained Pets Could Learn To Spot Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతి రోగానికి ఒక రకమైన వాసన ఉంటుందట. ఆ వాసననుబట్టే మలేరియా వ్యాధిని శిక్షణ పొందిన కుక్కలు క్షణాల్లో గుర్తిస్తున్నాయట. ప్రస్తుతం ప్రపంచ ప్రజలను తీవ్ర భయాందోళనలను గురి చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని కూడా అర సెకండ్‌లోనే శిక్షణ పొందిన కుక్కలు గుర్తించగలవని లండన్‌లోని ‘మెడికల్‌ డిటెక్షన్‌ డాగ్స్‌ చారిటీ’ ఇంచార్జి డాక్టర్‌ క్లేర్‌ గెస్ట్‌ తెలిపారు.కరోనా వైరస్‌ను గుర్తించడంలో రానున్న ఆరువారాల్లో తమ కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ఆ చారిటీ సంస్థ లండన్‌లోని ‘స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’తో కలసి పని చేయడానికి అంగీకరించినట్లు మంగళవారం మీడియా ముందుకు వచ్చిన డాక్టర్‌ క్లేర్‌ గెస్ట్‌ తెలిపారు. (మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ?)

కరోనా వైరస్‌ను గుర్తించేలా తమ చారిటీ కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ఆరు వారాల సమయం పడుతుందని, లాక్‌డౌన్‌ ఎత్తివేశాక మున్ముందు విమానాశ్రయాల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద శిక్షణ పొందిన కుక్కల అవసరం కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఒకేసారి విమానాశ్రయం నుంచి ఐదు వందల మంది ప్రయాణికులు బయటకు వచ్చినా, పది నిమిషాల్లో వారందరికి స్కానింగ్‌ చేసి వైరస్‌ బాధితులను శిక్షణ పొందిన మెడికల్‌ డాగ్స్‌ గుర్తించగలవని ఆమె చెప్పారు.

ప్రస్తుతం తమ వద్ద శిక్షణ పొందిన లాబ్రడార్‌ తలా, ఎమాన్‌ హోల్మ్‌ ్ప, రుత్‌లాంగ్స్‌ఫోర్డ్‌ జాతి శిక్షణ పొందిన కుక్కలకు 350 సెన్సార్ల గ్రాహక శక్తి ఉండడమే అందుకు కారణమని ఆమె చెప్పారు. రెండు ఒలింపిక్‌ పరిమాణంలో ఉన్న స్విమ్మింగ్‌ పూల్స్‌ను ఒకటిగా చేసి అందులో ఓ టీ స్పూన్‌ చక్కెరను వేస్తే దాని వాసనను గుర్తించేందుకు ఎంతటి గ్రాహక శక్తి కావాలో, అంతటి గ్రాహక శక్తి కుక్కలకు ఉందని ఆమె పేర్కొన్నారు. అదే మానవుడు ఒక కప్పు టీలో మాత్రమే చక్కెర వాసనను పసిగట్టగలడని ఆమె చెప్పారు. సాధారణంగా  మానవుడి వాసన గ్రాహక శక్తి ఐదు బిలియన్‌ సెన్సార్లు మాత్రమే.మానవులకు కేవలం ఐదు బిలియన్‌ సెన్సార్ల గ్రాహక శక్తి మాత్రమే ఉంటుంది. పలు రోగాలను త్వరితగతిన గుర్తించేందుకు మెడికల్‌ డాగ్స్‌ గుర్తిస్తున్నప్పటికీ ప్రపంచ వైద్య వ్యవస్థ వాటి సేవలను నేరుగా వినియోగించుకోవడం పట్ల ఎప్పుడూ దృష్టి పెట్టలేదు.(మే 3 వరకు లాక్‌డౌన్‌ : మోదీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement