వర్క్‌ ఫ్రం హోమ్‌: లైవ్‌లో రిపోర్టర్‌.. బాత్రూంలో నుంచి.. | Tv Reporter Working From Home Interrupted By Shirtless Father | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రం హోమ్‌: లైవ్‌లో రిపోర్టర్‌.. బాత్రూంలో నుంచి..

Published Thu, Apr 2 2020 12:17 PM | Last Updated on Thu, Apr 2 2020 1:14 PM

Tv Reporter Working From Home Interrupted By Shirtless Father - Sakshi

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్(ఇంటి వద్ద నుంచే పని) చేస్తున్న​సంగతి తెలిసిందే. ఇది వినేందుక బాగానే ఉన్నా.. కష్టాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారికి ఆ కష్టాలు బాగా తెలుసు. బ్యాచిలర్స్‌కు ఇది పెద్ద ఇబ్బంది కాకపోయినా పెళ్లి అయిన వారికి కాస్త ఇబ్బందే. ఇక కొన్ని ఉద్యోగాలకు వర్క్‌ ఫ్రం హోం చేయడం చాలా కష్టం. అందులో మీడియా ఫీల్డ్‌ ఒకటి. మీడియాలో పనిచేసే వారు వర్క్‌ ఫ్రం హోం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జెస్సికా లాంగ్ అనే యువతి స్థానిక న్యూస్‌ చానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. కరోనావైరస్‌ నేపథ్యంలో ఆమె కూడా వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే ఇటీవల కరోనావైరస్‌ గురించి అప్‌డేట్స్‌ ఇవ్వాలని చానెల్‌ సిబ్బంది కోరడంతో ఆమె ఇంట్లో నుంచే లైవ్‌లోకి వచ్చారు. కిచెన్‌లో ఉన్న ఆమె లైవ్‌లో మాట్లాడుతుండగా.. ఆమె తండ్రి బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు. కూతురు లైవ్‌లో మాట్లాడుతుందన్న విషయం తెలియని ఆయన.. టీషర్ట్‌ వేసుకుంటూ బయటకు వచ్చారు. అది చూసిన ఆమె డాడీ‌.. అంటూ గట్టిగా అరవగా అతను తిరిగి బాత్రూంలోకే పరుగెత్తాడు. ఈ వీడియోను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. ‘ మీ డాడీ చాలా అందంగా ఉన్నారు’, ‘మంచి పని చేశారు డాడీ. పిల్లలకు ఎప్పడు ఇబ్బంది కలిగించవదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఇటీవల ఇలాంటిదే మరో వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ.. వెబ్ కామ్ ద్వారా తోటి ఉద్యోగులతో వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొంది. అయితే, ఆమె భర్తకు ఈ విషయం తెలియకపోవడంతో నేరుగా ఫ్యాంట్ వేసుకోకుండా ఆ గదిలోకి వచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం.. ఆమె పరిస్థితి ఎలా ఉందో అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement