పార్లమెంట్ భవనంలో రేప్
లండన్: బ్రిటన్ పార్లమెంట్ భవనంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అనుమానంతో 23 ఏళ్ల వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 14న పార్లమెంట్ భవనంలో మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచార వ్యతిరేక చట్టాల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతడిని బెయిల్ పై విడుదల చేసింది. తదుపరి విచారణ 2017 జనవరిలో జరుగుతుంది. అరెస్ట్ చేసిన వ్యక్తి ఎంపీ కాదని పోలీసులు స్పష్టం చేశారు.
నిందితుడు కన్జర్వేటివ్ ఎంపీ తరపున పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అతడి కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. పార్లమెంట్ భవనంలో మహిళ లైంగిక వేధింపులకు గురైనట్టు తమకు దృష్టికి వెంటనే అప్రమత్తమయ్యామని, కేసు విచారణలో పోలీసులకు సహరిస్తున్నామని హౌస్ ఆఫ్ కామన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నందున వివరాలు వెల్లడించలేమని చెప్పారు. దీనిపై స్పందించేందుకు కన్జర్వేటివ్ పార్టీ నిరాకరించింది.