
న్యూయార్క్ : పాకిస్థాన్ వ్యవహార శైలిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారు. అంతర్గతంగా వైట్ హౌస్‌లో అధికారులతో జరిగిన సమావేశంలో ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాము చేయాలనుకున్న సహాయాన్ని నిలిపివేయాలని సూచించినట్లు తెలిసింది. ప్రతి సంవత్సరం పాక్ భద్రతకోసం, ఉగ్రవాద దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం అమెరికా దాదాపు 255 మిలియన్ డాలర్లను సాయంగా అందిస్తుంటుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కొద్ది రోజులపాటు నిలిపి ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచనలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
అసలు ఇస్లామాబాద్ ఉగ్రవాదం విషయంలో చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఈ డబ్బు ద్వారానే పరీక్షించాలని తాము భావిస్తున్నట్లు ట్రంప్ సన్నిహిత అధికారుల్లో ఒకరు చెప్పారు. 2002 నుంచి తాము పాక్‌కు సహాయం చేస్తూ వస్తున్నామని ఇప్పటి వరకు ఆ సాయం 33 బిలియన్ డాలర్లకు చేరిందని చెప్పారు. 'ఈ నెలలో మరోసారి తమ సీనియర్ అధికారులు అంతా సమావేశమై పాక్‌కు ఇచ్చే డబ్బు విషయం ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం ఉంటుంది' అని సీనియర్ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment