వాషింగ్టన్: వ్యాధుల నిర్ధారణకు చేసే రక్త, మూత్ర పరీక్షలు కొంతమేర ఖరీదైనవే. ఈ పరీక్షలు చేసేందుకు బోలెడంత డబ్బు పోసి యంత్రాలు కొనాల్సి రావడం దీనికి కారణం. అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని దాటేశామని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించేందుకు ఓ పరికరాన్ని తయారు చేశామని వారు ప్రకటించారు. దాదాపు రూ.40 వేల ఖరీదు చేసే ఈ యంత్రం.. లక్షల విలువైన యంత్రాలకు తీసిపోని ఫలితాలిస్తుందని శాస్త్రవేత్త కన్నింగ్‌హామ్ చెప్పారు.
‘ట్రై అనలైజర్’అని పిలుస్తున్న ఈ యంత్రం స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను స్పెక్ట్రోమీటర్‌గా మార్చడం ద్వారా పనిచేస్తుంది. విశ్లేషించాల్సిన ద్రవ నమూనాను ఒక పరికరంలో ఉంచినప్పుడు దీనిపై ఫోన్‌లోని ఎల్‌ఈడీ లైట్ కాంతిని ప్రసరింపజేస్తారు. ఇంకోవైపు నుంచి ఆ కాంతిని ఒక ఆప్టిక్ ఫైబర్ తీగలో సేకరించి ఫోన్‌లోని కెమెరా ఉన్న వైపునకు పంపించి తేడాలు గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ పరికరం ద్వారా ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ నమూనాలను పరీక్షించవచ్చు. వైద్య పరీక్షలతో పాటు ఈ పరికరాన్ని జంతువుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు, మత్తు పదార్థాలు మందులను గుర్తించేందుకు వాడొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్పెక్ట్రోమీటర్ అవసరమున్న ప్రతి రంగంలోనూ దీన్ని వాడొచ్చని కన్నింగ్‌హామ్ అంటున్నారు.
‘స్మార్ట్’గా వ్యాధి నిర్ధారణ!
Published Sun, Aug 13 2017 2:56 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
Advertisement
Advertisement