ట్రంప్‌కు తలనొప్పి షురూ.. మళ్లీ కోర్టు ఝలక్
లాస్‌ఎంజెల్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఈసారి అప్పీల్ కోర్టులో చుక్కెదురైంది. ఏడు ముస్లిం దేశాలకు చెందిన వ్యక్తుల అమెరికా ట్రావెలింగ్‌పై ఆయన విధించిన నిషేధంపై కిందిస్థాయి కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, తన ఆదేశాలు యథావిథిగా అమలు చేసేందుకు అనుమతివ్వాలంటూ చేసుకున్న అప్పీల్‌ను అమెరికా కోర్టు తిరస్కరించింది. కిందిస్థాయి కోర్టు ఇచ్చిన ఆదేశాలకు మద్దతిస్తూ ఝలక్ ఇచ్చింది. ఏడు ముస్లిం దేశాల పౌరులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఫెడరల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను ట్రంప్ సర్కారు తాజాగా ఈ సవాల్ చేసింది.
ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేస్తూ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెరికా న్యాయశాఖ శనివారం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. ఏడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చే వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని సియాటెల్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జేమ్స్ రాబర్ట్ తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ జడ్జీ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసి.. తిరిగి నిషేధాన్ని అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ సర్కారు భావించింది. అయితే వారు అప్పీల్ చేసుకున్న తొమ్మిదో సర్క్యూట్ కోర్టులో ఇలాంటి పరిస్థితి రావడంతో ఏం చేయాలా అని ఇప్పుడు తల పట్టుకుంటున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలకై ఇక్కడ చదవండి
(ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!)
(‘నిషేధం’పై వెనక్కి!)
(డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!)
(ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!)