refugee ban
-
పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. 17లక్షల మందిని..
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఉన్న అఫ్గానిస్థాన్‌కు చెందిన శరణార్థులను వెంటనే పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో పాకిస్తాన్ నుంచి వారిని తరిమేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయితే, అప్ఘానిస్థాన్ నుంచి పాక్‌కు శరణు కోరి వచ్చిన వారి సంఖ్య దాదాలపు 17లక్షలకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ అనుమతి లేకుండా పాకిస్తాన్లోకి వచ్చిన వారు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే తరిమివేస్తామని హెచ్చరించింది. అధికారికంగా అనుమతి పొందిన వారిని కూడా పంపించే ప్రయత్నం చేస్తోందని అక్కడి మీడియా కొన్ని కథనాల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే వందల మందిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌లోని అఫ్గాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌ను 2021లో తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత అనేక మంది అప్ఘన్లు.. పాక్‌కు శరణార్థులుగా వచ్చారు. ఇక, ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13లక్షల మంది అఫ్గాన్ పౌరులు శరణార్థులుగా రిజిస్టర్ చేసుకున్నారు. మరో 8.8లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. మరో 17లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల పేర్కొన్నారు. అక్రమంగా వచ్చినవారంతా నవంబర్ 1నాటికి తమ దేశం విడిచి పోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా బహిష్కరిస్తామన్నారు. నవంబర్ తర్వాత పాస్‌పోర్టు లేదా వీసా లేకుండా దేశంలోకి ఎవరినీ అనుమతించమన్నారు. పాకిస్థాన్ పౌరులు కాకున్నా.. ఐడీ కార్డులున్న వారి జాతీయతను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టింగ్‌నూ ఉపయోగిస్తామని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కెనడాకు భారత్ మరోసారి హెచ్చరికలు.. -
ట్రంప్‌కు తలనొప్పి షురూ.. మళ్లీ కోర్టు ఝలక్
లాస్ఎంజెల్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఈసారి అప్పీల్ కోర్టులో చుక్కెదురైంది. ఏడు ముస్లిం దేశాలకు చెందిన వ్యక్తుల అమెరికా ట్రావెలింగ్‌పై ఆయన విధించిన నిషేధంపై కిందిస్థాయి కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, తన ఆదేశాలు యథావిథిగా అమలు చేసేందుకు అనుమతివ్వాలంటూ చేసుకున్న అప్పీల్‌ను అమెరికా కోర్టు తిరస్కరించింది. కిందిస్థాయి కోర్టు ఇచ్చిన ఆదేశాలకు మద్దతిస్తూ ఝలక్ ఇచ్చింది. ఏడు ముస్లిం దేశాల పౌరులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఫెడరల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను ట్రంప్ సర్కారు తాజాగా ఈ సవాల్ చేసింది. ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేస్తూ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెరికా న్యాయశాఖ శనివారం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. ఏడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చే వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని సియాటెల్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జేమ్స్ రాబర్ట్ తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ జడ్జీ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసి.. తిరిగి నిషేధాన్ని అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ సర్కారు భావించింది. అయితే వారు అప్పీల్ చేసుకున్న తొమ్మిదో సర్క్యూట్ కోర్టులో ఇలాంటి పరిస్థితి రావడంతో ఏం చేయాలా అని ఇప్పుడు తల పట్టుకుంటున్నట్లు సమాచారం. సంబంధిత వార్తలకై ఇక్కడ చదవండి (ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!) (‘నిషేధం’పై వెనక్కి!) (డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!) (ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!) -
ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!
ఏడు ముస్లిం దేశాల పౌరులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఫెడరల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను ట్రంప్ సర్కారు సవాల్ చేసింది. ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేస్తూ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెరికా న్యాయశాఖ శనివారం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. ఏడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చే వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని సియాటెల్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జేమ్స్ రాబర్ట్ తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో ట్రావెల్ బ్యాన్‌ను తాత్కాలికంగా అమెరికా అధికారులు ఉపసంహరించుకోవడంతో ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. లండన్, పారిస్ నుంచి న్యూయార్క్, వాషింగ్టన్ వచ్చేందుకు ప్రామాణిక వీసా ఉన్న ఆయా దేశాల పౌరులు ప్రయత్నిస్తున్నారు. ఫెడరల్ జడ్జీ ఆదేశాలతో ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయ విమానాయాన సంస్థలు కూడా ట్రావెల్ బ్యాన్ ఆదేశాలను ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ జడ్జీ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసి.. తిరిగి నిషేధాన్ని అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలనుంచి వలసలపై తన కార్యనిర్వాహక ఆదేశాలపై సియాటెల్ డిస్ట్రిక్ట్ జడ్జి తాత్కాలికంగా నిషేధం విధించటంపై ట్రంప్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ‘జడ్జిది పిచ్చి నిర్ణయం’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం అర్థరాత్రి వెల్లడైన ఆదేశాలపై స్పందిస్తూ.. ‘సోకాల్డ్ న్యాయమూర్తి (జేమ్స్ రాబర్ట్) తీసుకున్న నిర్ణయం దేశం నుంచి చట్టాన్ని వేరుచేస్తోంది. ఇది పిచ్చి నిర్ణయం. ఇది తిరగబడుతుంది’ అని ట్విటర్ వేదికగా ఆగ్రహించారు. అయితే, ఒక అధ్యక్షుడు ఫెడరల్ జడ్జిపై ఇలా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఇదే తొలిసారి అని, ట్రంప్‌లో న్యాయస్థానాన్ని ధిక్కరించే ధోరణి కనిపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.