పాక్కు అమెరికా హెచ్చరిక! | US has asked Pakistan to co-operate with India | Sakshi
Sakshi News home page

పాక్కు అమెరికా హెచ్చరిక!

Published Fri, May 27 2016 1:26 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

US has asked Pakistan to co-operate with India

వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థల వివరాలను ఆ దేశం వెల్లడించాలని అమెరికా కోరింది. తాలిబాన్ ఉగ్రవాద సంస్థలతో పాటు అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిగతా ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్కే ముప్పు అని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ మార్క్ టోనర్ హెచ్చరించారు.

26/11 ముంబై దాడుల కేసు విచారణలో భారత్తో పాక్ సహకరించాలని టోనర్ ఈ సందర్భంగా సూచించారు. భారత అధికారులకు ముంబై దాడుల విచారణలో పూర్తి స్థాయిలో సహకరించాలని గతంలోనూ తాము పాకిస్తాన్కు సూచించామని పాత్రికేయుల సమావేశంలో టోనర్ గుర్తు చేశారు. ముంబై దాడులను దారుణమైన ఘటనగా పేర్కొన్న ఆయన ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement