‘కశ్మీర్‌పై లష్కరే అంకితభావం ప్రేరణనిచ్చింది’ | "Lashkar-e-Kashmir on the commitment inspired ' | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్‌పై లష్కరే అంకితభావం ప్రేరణనిచ్చింది’

Published Thu, Apr 23 2015 2:54 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

‘కశ్మీర్‌పై లష్కరే అంకితభావం ప్రేరణనిచ్చింది’ - Sakshi

‘కశ్మీర్‌పై లష్కరే అంకితభావం ప్రేరణనిచ్చింది’

న్యూయార్క్: ముంబై దాడులకు  కుట్రపన్ని అమెరికాలో ఊచలు లెక్కపెడుతున్న పాక్-అమెరికన్ ఉగ్రవాది హెడ్లీ తన ఉగ్రకార్యకలాపాల గురించి ఓ పుస్తకం రాశాడు. కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేయ డానికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చూపిన అంకితభావంఎంతో ప్రేరణనిచ్చిందని, అందుకే ఆ సంస్థలో చేరానని  అందులో వివరించాడు.

హెడ్లీ రాసిన పుస్తకం చిత్తుప్రతిని అమెరికాలో ఓ టీవీ చానెల్ ‘ఫ్రంట్‌లైన్’ అనే కార్యక్రమం ద్వారా బయటపెట్టింది. పాక్‌లో ఉగ్ర శిక్షణ వంటి అనేక అంశాలను హెడ్లీ ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. ముంబై ఉగ్రదాడి  సందర్భంగా భారత కోస్ట్ గార్డ్ అనుమానించకుండా భారత జాలర్ల నౌకను పట్టుకోవాలని తొలుత పథకం వేసినట్లు తెలిపాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement