ఒబామాకు మోదీ బెస్ట్ ఫ్రెండ్: వైట్‌హౌస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీని మంచి మిత్రుడిగా చూస్తారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ చైనా సముద్రం వివాదానికి సంబంధించి హేగ్‌లోని అంతర్జాతీయ స్థాయి శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం చైనాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పుతో ఏర్పడిన ఉద్రిక్తతలను పరిష్కరించే విషయంలో భార త్-అమెరికాలు సత్సంబంధాలను కలిగి ఉన్నాయని వైట్‌హౌస్ అధికారి ఎరిక్ తెలిపారు. గతేడాది డిసెంబరులో పారిస్‌లో జరిగిన వాతావరణ ఒప్పందం విషయంలో మోదీ అమెరికాకు మద్దతు తెలిపారన్నారు. ఈ కారణాల వల్ల మోదీతో తనకున్న బంధానికి ఒబామా అమిత విలువనిస్తారని ఎరిక్ వివరించారు.