కదిలే.. అదిరే.. | walking bridge in Germany | Sakshi
Sakshi News home page

కదిలే.. అదిరే..

Published Tue, Jul 1 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

కదిలే.. అదిరే..

కదిలే.. అదిరే..

ప్రపంచంలోని కదిలే యంత్రాల్లో ఇదే అత్యంత పెద్దది. ‘ఎఫ్60’ అనే ఈ కన్వేయర్ బ్రిడ్జిని జర్మనీలోని లుసాటియన్‌లో బొగ్గు గనుల్లో వినియోగించడం కోసం 1991లో రూపొందించారు. ఏకంగా అరకిలోమీటరుకు పైగా పొడవున్న దీని బరువు ఎంతో తెలుసా? 13,600 టన్నులు. ముందువైపు, వెనుకవైపు రెండు బోగీలపై ఆధారపడి ఇది కదులుతుంది.

ఈ బోగీలు ఒక్కోదానికి 760 చక్రాలుంటాయి. 502 మీటర్ల పొడవు, 80 మీటర్ల ఎత్తు, 240 మీటర్ల వెడల్పు కలిగిన ఈ కన్వేయర్ బ్రిడ్జి గరిష్ట వేగం నిమిషానికి 13 మీటర్లు మాత్రమే. 1991 మార్చిలో ప్రారంభమైన ఈ ఎఫ్60.. 1992 జూన్‌లో నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement