జాలిస్కో : మెక్సికోలోని జాలిస్కో ప్రాంతంలో ఉన్న జూపార్కు నుంచి ఒక పులి ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకొని రోడ్డు వెంబడి పరుగులు తీసింది. అయితే అదృష్టం బాగుండడంతో ఆ పులి ఎవరి మీద దాడి చేయలేదు. దానిని పట్టుకోవడానికి వచ్చిన ముగ్గరు అటవీ అధికారులను కూడా పులి పరుగులు పెట్టేలా చేసింది. ఇది కాస్తా వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న పులి ముందు పరిగెడుతుంటే దాని వెనుకాలే ముగ్గురు వ్యక్తులు తాడు సాయంతో దానిని పట్టుకోవాలని చూశారు. కానీ అది ఇంకా వేగం పెంచడంతో వారు వచ్చిన వాహనాన్ని డ్రైవర్ సాయంతో పులిని మరింత ముందుకు వెళ్లకుండా చేశారు. ఆ ముగ్గురిలో టోపీ పెట్టుకున్న వ్యక్తి తన చేతిలోని తాడును పులి మెడకు చుట్టుకునేలా వేశాడు. అయితే పులి తాడుకు చిక్కిందా.. లేదా అన్నది వీడియోలో కనిపించలేదు. కాగా పులి తాడును బలంగా లాగడం బట్టి చూస్తే చిక్కినట్లే తెలుస్తుంది. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో జూపార్కలు మూసివేయడంతో వాటికి ఆహారం ఇచ్చేవారు కరువవడంతో జంతువులు ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకొని రోడ్డు మీద పరుగులు తీసున్నాయి.
చనిపోయాడనుకున్నారు.. కానీ తిరిగి వచ్చాడు
లాక్‌డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం
ఇంతకీ పులి చిక్కిందా.. లేదా!
Published Fri, May 15 2020 11:23 AM | Last Updated on Fri, May 15 2020 11:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment