
లండన్: గ్రహాంతరవాసుల ఉనికిని గుర్తించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా మన పాలపుంతకు సమీపాన ఉన్న ఓ నక్షత్ర వ్యవస్థకు సందేశాన్ని (రేడియో మెసేజ్) పంపించారు. ఈ నక్షత్ర వ్యవస్థలోని జీజే 273 అనే నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇందులో జీజే 273బీ అనే గ్రహంపై ద్రవరూపంలో నీరు ఉండటంతోపాటు నివాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయని మెస్సేజింగ్ ఎక్స్‌ట్రాటెర్రేస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాగ్లస్ వాకోచ్ చెప్పారు. ఈ గ్రహంపై గ్రహాంతరవాసుల ఉనికి గుర్తించేందుకుగాను సందేశాన్ని పంపినట్లు తెలిపారు. అంచనా ప్రకారం దాదాపు 25 సంవత్సరాలలోపు అక్కడి నుంచి ఏదో ఒక సమాచారం తమకు అందుతుందని అన్నారు. ఈ సందేశాన్ని మూడు రోజులపాటు కష్టపడి నార్వే నుంచి గత అక్టోబర్‌లో పంపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment