ఆ పిచ్చితో చనిపోవడంలో మనమే టాప్
స్వీయ చిత్రం(సెల్ఫీ) అనే మాటను రోజులో కనీసం ఒక్కసారైనా అనుకోకుండా ఉండం. అంతగా మనం రోజూ ఉపయోగించే పదాల్లో చేరిపోయిందీ పదం. 2012లో అడుగుపెట్టిన ఈ నయాట్రెండ్ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతోంది. ఎందుకంటే సెల్ఫీ కాస్త ఇప్పుడు సెల్ఫ్ కిల్లింగ్కు దారి తీయడమే అందుకు కారణం అవుతోంది. తన చిత్రాన్ని తానే తీసుకుంటూ మృత్యువును కౌగిలించుకోవాల్సి వస్తున్న ఈ రోజుల్లో అసలు సెల్ఫీ ఎప్పుడు స్టార్ట్ అయింది, సెల్ఫీని ఇష్టపడేవారు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, సెల్ఫీలు దిగుతూ వారు ఏ కారణాలతో చనిపోయారు అనే వివరాలను అధ్యయనం చేసిన స్టాటిస్తా అనే సంస్థ దాని వివరాలను పొందుపరిచింది. ఈ వివరాల్లో ఎక్కువగా భారతీయులను అవాక్కయ్యేలా చేసే అంశాలే ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచం మొత్తంలో కూడా సెల్ఫీల కారణంగా భారతీయులే అధికంగా చనిపోతున్నట్లు ఆ అధ్యయనం తెలిపింది. ప్రపంచం మొత్తంగా 2012 నుంచి 2014 మధ్యకాలంలో సెల్ఫీల కారణంగా మొత్తం 49 మంది చనిపోగా వారిలో 36మంది అబ్బాయిలు, 13 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరంతా కూడా 21 సంవత్సరాల లోపే ఉండటం మరో విశేషం. ఇక వీరిలో ఏ దేశానికి చెందిన వారు అధికంగా ఉన్నారని పరిశీలిస్తే...
భారత్లో సెల్ఫీల కారణంగా చనిపోయినవారు 19
రష్యా 7
అమెరికా 5
స్పెయిన్ 4
పిలిప్పీన్స్ 4
పోర్చుగల్ 2
ఇండోనేసియా 2
సౌతాఫ్రికా 1
రోమానియా 1
పాకిస్థాన్ 1
మెక్సికో 1
ఇటలీ 1
చైనా ఒకరు చనిపోయారు. కాగా, వీరిలో సెల్ఫీలు దిగుతుండగా ఏ కారణంతో చనిపోయారనే అంశం పరిశీలిస్తే..
ఎత్తులో నుంచి పడిపోయి 16 మంది చనిపోగా..
నీటిలో మునిగిపోయి 14
రైలు ప్రమాదంలో 8
తుపాకీ కారణంగా 4
విమాన ప్రమాదంలో 2
కారు ప్రమాదంలో 2
జంతువు దాడి కారణంగా ఒకరు సెల్ఫీ దిగుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.