బ్రాండ్ ఇమేజ్ ఉన్న దేశాలు తెలుసా?
న్యూయార్క్: ప్రతి దేశానికి ఓ బ్రాండ్ ఇమేజ్ అంటూ ఉంటుంది. దాని ఆధారంగా మిగితా వస్తువులకు కూడా ఓ ప్రత్యేక డిమాండ్ వస్తుంది. చాలామంది కూడా ఆ బ్రాండ్ చూసే ఆ దేశాలను ఇష్టపడుతుంటారు. పర్యటిస్తుంటారు. అలా.. అత్యధిక విలువ కలిగిన బ్రాండ్లు కలిగిన దేశాలను ఓసారి పరిశీలిస్తే అన్నింటికన్న అగ్రరాజ్యం అమెరికా ముందుంది.
ఫైనాన్షియల్ టైమ్స్కు చెందిన డి ఇంటెలిజెన్స్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విలువైన బ్రాండ్లను కలిగి ఉన్న టాప్ 10 దేశాల జాబితాను ప్రకటించింది. ఇందులో అమెరికాలో తయారయ్యే వస్తువులకు, అవి అందించే సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ ఉందని తెలిపింది. వీటిపక్కనే చైనా, జర్మనీకి చెందిన వస్తువులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపింది. భారత్ లోని వస్తువులకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఏడో స్థానంలో ఉంది.
ఒక్కసారి ఆ టాప్ 10 దేశాల జాబితాను పరిశీలిస్తే..
1.అమెరికా
2.చైనా
3.జర్మనీ
4.బ్రిటన్
5.జపాన్
6.ఫ్రాన్స్
7.ఇండియా
8.కెనడా
9.ఇటలీ
10.ఆస్ట్రేలియా