రేటు విని.. గుండె జారి గల్లంతయిందే | Women shocked with the Bracelet rate | Sakshi
Sakshi News home page

రేటు విని.. గుండె జారి గల్లంతయిందే

Published Mon, Jul 3 2017 1:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

రేటు విని.. గుండె జారి గల్లంతయిందే - Sakshi

రేటు విని.. గుండె జారి గల్లంతయిందే

కొన్నిసార్లు షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే కొన్ని వస్తువులు విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఆ వస్తువులను కొనడానికి సరిప డేంత డబ్బులేనప్పుడు.. వాటిని కాసేపు పట్టుకొని చూసి అక్కడ పెట్టేసి రావడం చేస్తుంటారు కొందరు. సరిగ్గా ఇలాచేసే ఓ చైనా మహిళ స్పృహ తప్పి పడిపోయింది! యునాన్‌ ప్రావిన్స్‌ రూయిలి పట్టణంలో ఓ షాపులోకి వెళ్లిన మహిళ.. పచ్చరాయితో చేసిన బ్రాస్‌లెట్‌ను చూసి ముచ్చటపడింది. కొనకపోయినా పర్లేదు కనీసం చూద్దామని చేతిలోకి తీసుకుంది. అయితే అదికాస్తా జారి కిందపడటంతో 2 ముక్కలైంది. ఈ విషయాన్ని గమనించిన షాప్‌ యజమాని బ్రాస్‌లెట్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా దాని ఖరీదును ఆ మహిళకు చెప్పాడు.

అంతే ఆ రేటు విన్న మహిళ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు ఫిట్స్‌ వచ్చినట్లు నేలపై పడి కొట్టుకుంది. అక్కడివారు మొహం మీద కాసిన్ని నీళ్లు చల్లాక లేచి కూర్చున్న ఆ మహిళ.. బ్రాస్‌లెట్‌ రేటు 3,00,000 యువాన్‌లు (రూ. 28.60 లక్షలు) అని వినగానే స్పృహ తప్పానని చెప్పింది. ఆ మహిళ తరఫువారు 70,000 యువాన్‌లు రూ. (6.67 లక్షలు) చెల్లిస్తామని చెప్పినా యజమాని ఒప్పుకోకపోవడంతో చివరకు 1,80,000 యువాన్‌ల (రూ. 17.16 లక్షలు)కు బేరం కుదుర్చుకొని పగిలిపోయిన బ్రాస్‌లెట్‌ను పట్టుకెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement