ట్రాన్స్జెండర్లకు శుభవార్త. ప్రపంచంలోనే మొట్టమొదటి లింగ మార్పిడి మోడల్ ఏజెన్సీ లాస్ ఏంజెలిస్లో రాబోతోంది. బ్యాంకాక్కు చెందిన ఓ సంస్థ ఈ ఏజెన్సీని ప్రారంభిస్తోంది.
న్యూయార్క్: ట్రాన్స్జెండర్లకు శుభవార్త. ప్రపంచంలోనే మొట్టమొదటి లింగ మార్పిడి మోడల్ ఏజెన్సీ లాస్ ఏంజెలిస్లో రాబోతోంది. బ్యాంకాక్కు చెందిన ఓ సంస్థ ఈ ఏజెన్సీని ప్రారంభిస్తోంది. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్లో ఆపిల్ మోడల్ మేనేజ్మెంట్ ఆరు లింగమార్పిడి మోడల్స్కు ఇప్పటికే అవకాశం కల్పించింది. తమ సంస్థలో చేరేందుకు కొత్త వారి కోసం తాము అన్వేషిస్తున్నట్టు సీఈవో సెసిలో అసున్సియన్ తెలిపారు.
తమ ఏజెన్సీలో ఆడ, మగ అనే ప్రశ్నకు తావు లేదన్నారు. లింగమార్పిడి చేయించుకున్నవరిలో ఎవరైనా తమ అభిరుచికి తగినట్లు బెస్ట్ మోడల్స్గా రాణించవచ్చని అభిప్రాయపడ్డారు. పుట్టుకతో మగవాళ్లయినా తర్వాత ఆడవారుగా మారడం, ఆడవారిగా పుట్టి మగవారిగా ఆపరేషన్ చేయించుకుని మారడం ఎప్పటినుంచో ఉన్నదే. ఇలా మారిన వారికి కూడా మోడళ్లుగా అవకాశం ఇవ్వడం కోసం ఈ తరహా సంస్థలు వెలుస్తున్నాయి.