
ప్రతీకాత్మక చిత్రం
నేను స్కూల్లో చదువుతున్నపుడు చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు. కానీ, ఆ వయసులో ఆకర్షణలు మామూలే అనుకుని వాళ్లతో మాట్లాడటం మానేసేదాన్ని. వాళ్లు కూడా ఆ తర్వాతి సంవత్సరం ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేసేవాళ్లు. నేను వాళ్ల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ, ఓ అబ్బాయికి మాత్రం నేనంటే చాలా ఇష్టముండేది. అతడి ప్రవర్తనతో ఆ విషయం అర్థం అయ్యేది. దీంతో నా ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అతడ్ని ఏడిపించేవాళ్లు. అతడు మాత్రం ఎప్పుడూ నాకు ప్రపోజ్ చేయలేదు. నేను కూడా లైట్ తీసుకున్నా. నేను పదవతరగతి చదువుతున్నపుడు ఓ లెటర్ ద్వారా నాకు ప్రపోజ్ చేశాడు. నేను నమ్మలేదు! అదంతా కూడా ఆకర్షణే అని వాదించి, అతన్ని తిట్టి ‘ఐ హేట్ యూ’ చెప్పేశా. నేను అతన్ని పట్టించుకోలేదు. అలా ఏళ్లు గడిచాయి. అతడు కూడా నన్ను పలకరించటం మానేశాడు. మొత్తానికి నన్ను లైట్ తీసుకున్నాడు అనుకున్నా.
నేను డిగ్రీ చదువుతున్నపుడు నేనో వ్యక్తిని ఇష్టపడ్డాను. అతడితో ఎప్పుడూ ఓ మాట చెప్పేదాన్ని ‘ మనం ముందు లైఫ్‌లో సెటిల్ అవుదాం. తర్వాత సరదాల గురించి ఆలోచిద్దాం’అని. అయితే అప్పుడప్పుడు నాకు పదవ తరగతిలో ప్రపోజ్ చేసిన అబ్బాయి గుర్తుకు వచ్చేవాడు. నాకు చాలా బాధవేసేది. జరిపోయిందేదో జరిగిపోయిందనుకునేదాన్ని. ఇన్‌డైరెక్ట్‌గా అతడి సారీ చెబుతుండేదాన్ని. ముఖాముఖీగా నేనెప్పుడూ సారీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అయామ్ రియల్లీ సారీ!
- కిరణ్మయి, కేరళ
చదవండి : ఆమె నన్ను మోసం చేసింది.. కానీ..
అందుకే నేను, నా భార్య విడిపోయాం