ఆమె నన్ను మోసం చెయ్యలేదు | Sad Ending Love Story Of Naveen From Miryalaguda | Sakshi
Sakshi News home page

ఆమె నన్ను మోసం చెయ్యలేదు

Published Thu, Oct 31 2019 3:50 PM | Last Updated on Thu, Oct 31 2019 4:15 PM

Sad Ending Love Story Of Naveen From Miryalaguda - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తను నాకు తెలిసిన అమ్మాయే. 2 సంవత్సరాలనుంచి చూస్తున్నా! మంచి అమ్మాయి. 6 నెలల క్రితం వరకు మేము పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తరువాత వాట్సాప్‌లో తను పెట్టే స్టేటస్‌లకు నా అభిప్రాయాలను చెప్పడం.. నా స్టేటస్‌లపై తను స్పందించడం జరిగేది. ఇలా మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. తను నాకు అర్థం అయ్యే కొద్దీ తనంటే ఇష్టం పెరుగుతూ వెళ్లింది. ఈ రోజుల్లో చదువు, వ్యక్తిత్వం, అందం అనుకువ, ఎదుటివారిని అర్థం చేసుకునే మనసు ఉన్న అమ్మాయిలు నాకు తెలిసి ఎవరూ లేరు అనుకున్నా! కానీ, నా అభిప్రాయం తప్పని తేలుస్తూ తను కనపడింది. నా ప్రేమ విషయం ఎలా చెప్పాలి తనతో? ఏడడుగులు నడవాలంటే వచ్చే ఇబ్బందులేంటి? నా ప్రేమ విషయం చెప్తే తను ఏం అంటుంది? ఇవే ఆలోచనలు.

తను నా జీవితంలోకి వస్తే గతంలో నేను కోల్పోయిన వన్నీ తిరిగి వస్తాయని సంతోషించా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని తనకు ఇన్ డైరెక్ట్‌గా చెప్తూనే వున్నా. తన ఇంట్లో వాళ్లు ఎంతవరకు నన్ను ఒప్పుకుంటారో తెలుసుకోమని అడిగేవాన్ని. నేను ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తున్నపుడే తను ఒక విషయం చెప్పింది. తన ఇంట్లో వాళ్లు గతంలో ఓ సంబంధం చూశారని, వాళ్లు ఎంగేజ్‌మెంట్‌ పెట్టుకోవాలని చూస్తున్నారని, ఆ విషయంపై ఇంట్లోవాళ్లు ఆలోచిస్తున్నారని చెప్పింది. మరో వారంలో ఎంగేజ్‌మెంట్‌ జరిగే అవకాశం వుందని అంది. వచ్చిన సంబంధం గురించి నేను ఎంక్వైరీ చేస్తే పాజిటివ్‌గానే తెలిసింది. నాకన్నా అబ్బాయ్ బెటర్ పొజిషన్‌లో ఉన్నాడు.

నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతోందని తెలిసి ఏడుపు ఆగలేదు. తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ప్రేమలో నేను మోసపోలేదు.. తను నన్ను మోసం చెయ్యలేదు. ఒక మంచి అమ్మాయిని ప్రేమించా కానీ, నాకు సమయం లేక తనను దక్కించుకోలేకపోయా.

జీవితాంతం నీకు తోడుగా ఉండి నిన్ను సంతోషంగా చూసుకోవాలి అనుకున్నా. కానీ, అనుకోకుండా దూరం అయ్యా. జీవితాంతం నువ్వు సంతోషంగా వుండాలని కోరుకుంటూ..
- నవీన్‌, మిర్యాలగూడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement