
ప్రతీకాత్మక చిత్రం
నేను ఇంటర్ మీడియట్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ, పిరికితనం కారణంగా డైరెక్ట్‌గా తనకు చెప్పలేకపోయాను. ఓ రోజు తనకు ఇన్ డైరెక్ట్‌గా నా ప్రేమ విషయం తెలిసేలా చేశాను. అయితే ఆ అమ్మాయికి ఆ విషయం అర్థం అయ్యిందో లేదో తెలియదు. ప్రతి రోజూ కాలేజీకి ఆ అమ్మాయి కోసమే వెళ్లే వాడిని. ఆ అమ్మాయి ఒక్కరోజు రాకపోయినా కాలేజ్‌లో ఉండలేకపోయేవాడిని. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎక్షామ్ టైంలో ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను. ప్రతి రోజూ ఎక్షామ్ సెంటర్‌కు వెళ్లేవాడిని కానీ, చెప్పలేకపోయేవాడిని. తను ఎదురుగా వచ్చేదలా.. చెప్పాలనుకుని చెప్పలేకపోయేవాడిని. ఒకరోజు తను నన్ను చూసింది. నేను తనను దాటి వెళ్లాక! ‘ ఆమె నన్ను చూసింది. అది చాలు’ అనుకున్నాను. ఎక్షామ్స్ అయిపోయాయి. నా ప్రేమ కథ ముగిసిపోయిందనుకున్నా. మూడు సంవత్సరాల తర్వాత తనే నాకు ఎఫ్‌బీలో మెసేజ్ చేసింది.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు తనకు నా ప్రేమ సంగతి చెప్పేశాను. నేను తనను ప్రేమిస్తున్న సంగతి తనకు ఇంటర్‌లోనే తెలుసునని చెప్పింది. కొన్నాళ్లు మాట్లాడుకున్నాం. అంతలో ఏమైందో ఏమో తెలియదు. నన్ను బ్లాక్ చేసేసి నాతో మాట్లాడటం ఆపేసింది. కొన్నాళ్ల తర్వాత తనే నన్ను అన్ బ్లాక్ చేసి మాట్లాడింది, మళ్లీ తనే బ్లాక్ చేసింది. తన కోసం సూసైడ్ అటెంప్ట్ చేశా. చివరినిమిషంలో బ్రతికా. మళ్లీ తనే మెసేజ్ చేసింది. నాకు పిచ్చెక్కిపోయింది.
ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావ్! నువ్వు తప్ప నా లైఫ్‌లో ఇంకొకరిని ఊహించుకోలేను. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు. చచ్చేవరకు నీకోసమే ఎదురుచూస్తాను.
- ప్రసాద్, గుంటూరు
చదవండి : నాన్న మాట కాదనను.. నిన్ను వదులుకోను
అలా చేస్తే సమాజంలో తల ఎత్తుకు తిరగలేం!
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment