
ప్రతీకాత్మక చిత్రం
బీటెక్ నా కెరీర్‌ను, లైఫ్‌ను మార్చేసింది. ఇంటర్ వరకు నేను ఊర్లో ఉండి చదువుకున్నాను. నాకు చదువు కాకుండా ఇంకేమీ తెలియదు. ఇంటర్‌నెట్, ఎఫ్‌బీ కూడా తెలియదు. చదువే నా ప్రపంచం. నా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో హాస్టల్‌లో జాయిన్ అయ్యాను. మొదటిసారి హాస్టల్ నాకు చాలా బాగా అనిపించింది. నేను వేరే వాళ్లతో అంత తొందరగా మాట్లాడలేకపోయేదాన్ని. అదే సమయంలో నా మొబైల్‌లోకి ఫన్‌చాట్ మెసేజ్ ఒకటి వచ్చింది. అప్పటినుంచి నేను ఫన్‌చాట్‌ను ఉపయోగించేదాన్ని. దాంట్లో ఎఫ్‌బీలాగా మెసేజ్‌లు వచ్చేవి. అప్పుడే పరిచయం అయ్యాడతను. నాకు తనొక మంచి పర్సన్ అనిపించి నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. తర్వాత తనే కాల్స్, మెసేజ్‌లు చేసేవాడు.
అలా నాలుగు సంవత్సరాలు నాకు డైలీ ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాడు. ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే తనే ధైర్యం చెప్పేవాడు. నేను నాలుగు సంవత్సరాలు అతనితో మాట్లాడాను కానీ, తను ఎలా ఉంటాడని నాకు తెలియదు. నేను అతన్ని ఫొటోలో కూడా చూడలేదు! చూడకుండానే లవ్ చేశాను. ఎంతలా అంటే తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని. ఇది నేనతనికి చెబితే‘ నేను నిన్ను సిస్టర్‌లానే అనుకున్నా’ అని చెప్పి అవాయిడ్ చేయటం మొదలుపెట్టాడు. నెంబర్లన్నీ మార్చేశాడు. బీటెక్ అయిపోయిన తర్వాత అతడికి బెంగళూర్‌లో జాబ్ వచ్చింది.
ఇక అన్నిట్లలో నన్ను బ్లాక్ చేశాడు. తన కోసం నేను పిచ్చిదానిలా రోడ్లమీద తిరిగాను. నా లవ్ ఆక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు. తనను ఒకసారి చూద్దామని అనుకున్నా ఆ ఛాన్స్ కూడా రాలేదు. తన కోసం తిరిగితిరిగి నా స్టడీస్, కెరీర్ అన్నీ వదిలేశా. తను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. నేను మా పేరెంట్స్ కోసం వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ఇప్పటికీ అతన్ని మర్చిపోలేక, బ్రతికున్నా చచ్చిన శవంలా జీవిస్తున్నా. ఏడేళ్లు కావస్తోంది. ఒక్కసారి కూడా అతడ్ని చూడలేకపోయాననే బాధతో ప్రాణంపోతోంది. నేను అతడ్ని చూడకపోయినా ప్రాణం పోయేవరకు మర్చిపోలేను.
-సౌమ్య
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment