సడెన్‌గా బ్లాస్ట్ చేసింది.. నేను షాక్! | Telugu Love Stories : Kishore Happy Ending Love Story | Sakshi
Sakshi News home page

సడెన్‌గా బ్లాస్ట్ చేసింది.. నేను షాక్!

Dec 5 2019 10:26 AM | Updated on Dec 5 2019 10:40 AM

Telugu Love Stories : Kishore Happy Ending Love Story - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేను ఇంటర్మీడియట్ వరుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్రెండ్స్, మూవీస్ అని ఎంజాయ్ చేశాను.  డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయిని చూశాను. ఏదో తెలియని క్రష్. ఆ అమ్మాయితో బాగా మాట్లాడేవాడిని. నేను చాలా అల్లరి చేసేవాడిని కాలేజీలో. అందుకేనేమో నేను బాగా నచ్చాను తనకి. నాతో రోజూ మాట్లాడేది. కాలేజీలో అందరూ మా మధ్యలో ఏదో ఉందని అనుకున్నారు. ఒక సారి ఉన్నట్టుండి మాట్లాడటం మానేసింది. నేను ఏమైందని అడిగాను! చెప్పలేదు. తర్వాత తెలిసింది మా క్లాస్లో ఒక అబ్బాయి అడిగాడట ‘నిన్ను ఆ అబ్బాయి లవ్ చేస్తున్నాడు కదా! నువ్వు ఒకే చెప్పావా?’ అని. అప్పుడు ఆ అమ్మాయి అంది ‘ ఆ అబ్బాయితో నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను అంతే’ అని. అప్పటినుంచి తను నాతో మాట్లాడటం మానేసింది! కాలేజీలో ఏమనుకుంటారో అని.  కానీ, ఆమెను మర్చిపోలేక పోయా. డిగ్రీ తర్వాత నేను జాబ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. ఒక రోజు ఆ అమ్మాయి నుంచి కాల్ వచ్చింది.  ఎలా వున్నావని. అప్పుడు ఆమె పీజీ చదువుతోంది. తర్వాత ప్రతి వారం కాల్ చేసేది. ‘ఎలా ఉన్నావ్‌? జాబ్ ట్రైల్స్ ఎలా ఉన్నాయి?’ అని అడిగేది. 

నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. విత్ గుడ్ శాలరీ. అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను నేను లవ్ చేస్తున్నానని. ‘అదేంటి ఇప్పుడు చెప్పావు సడన్‌గా’ అని అడిగింది.  ‘జాబ్ వచ్చిన తర్వాత నీకు ప్రపోజ్ చేద్దాం అని వేయిట్‌ చేశాను. సో నేను ఇప్పుడు చెప్పాను’ అని అన్నాను. తను ఒక వారం తర్వాత ఒకే అని చెప్పింది. ఒక రెండు సంవత్సరాలు డీప్ లవ్లో ఉన్నాము. రెండు నెలలకు ఒక సారి కలసి వచ్చేవాడిని. ‘నాకు ఇంట్లో మ్యారేజ్ చేస్తున్నారు’ అని సడెన్‌గా బ్లాస్ట్ చేసింది. నేను షాక్! వాళ్ల బ్రదర్స్‌తో మాట్లాడాను. నో అని అన్నారు. ‘మాది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు’ అని అన్నారు.

చాలా రిక్వెస్ట్ చేశాను కానీ ఒప్పుకోలేదు. ఒక రోజు ఆమె వాళ్ల నాన్నతో కూడా మా ప్రేమ విషయం చెప్పింది. ఆయన కూడా ఒప్పుకోలేదు. బయటకి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అన్నాను. కానీ, ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటేనే మ్యారేజ్ చేసుకుంటాను.. లేకుంటే చేసుకోను అని చెప్పింది. అలా  తను మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది. లైఫ్ ఇక లేదని చాలా బాధ పడ్డాను. కానీ ఒక సంవత్సరం తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. పెళ్లి చేసుంటానని నాకు ప్రపోజ్ చేసింది. తను నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంట్లో చెబితే రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకుని మంచి పోజిషన్లో ఉన్నాను.
- కిశోర్‌ 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement