
ప్రతీకాత్మక చిత్రం
నేను తనని చివరి సారిగా చూసి 26 సంవత్సరాల, 6నెలల, 4 రోజులు అవుతోంది. అవి నేను స్కూల్లో చదువుతున్న రోజులు. అప్పుడు నేను ఆరవ తరగతి చదువుతున్నా. తను ఐదవ తరగతిలో చేరింది. నేను తనను మొదటిసారి చూసినపుడు నా కోసమే పుట్టిందనిపించింది. తను ఎప్పుడూ నాకు దూరంగా ఉండటానికి ప్రయత్నించేది. ఎందుకో నాకు అర్థం అయ్యేది కాదు. నేను తనకంటే సీనియర్ అవ్వటం వల్ల నా పాత పుస్తకాలను తనకు ఇస్తుండేవాడిని. పదవ తరగతి చివరి ఎగ్జామ్ రోజు తనకు నేను ప్రపోజ్ చేశాను. తను నా ప్రేమను తిరస్కరించింది. స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పేరెంట్స్ నన్ను వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. నేను బ్రతికి బట్టకట్టినా నాకు బ్రతకాలనిపించలేదు.
ఎందుకంటే ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఒక సంవత్సరం తర్వాత ఏదో వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాను. అప్పుడు ఓ టైప్ ఇన్‌స్టిట్యూట్‌లో తనను చూశాను. నేను తన దగ్గరకు వెళ్లి పలకరించాను. నేను బ్రతికుండటం చూసి తను షాక్ అయ్యింది. తను అప్పుడు నా ప్రేమను ఒప్పుకుంది. అయితే ఓ కండీషన్ పెట్టింది. తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడగమంది. అది జరిగే పనికాదు. తను నన్ను 1993 మే 6న వదిలి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంది.
- శ్రీధర్ రెడ్డి
చదవండి : ప్రేయసి కోసం ప్రాణాలు వదిలాడు
తను మాట్లాడింది.. షాక్ కొట్టినంత పనైంది
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి