ప్రతీకాత్మక చిత్రం
పుస్తకం : వెన్నల్లో ఆడపిల్ల
రచయిత : యండమూరి వీరేంద్రనాథ్
కథ : రేవంత్ ప్రముఖ చెస్ ఛాంపియన్. అతడికి ఫోన్ కాల్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. పేరు చెప్పకుండా, నేరుగా కనిపించకుండా అతడితో పందేలు కాస్తూ ఉడికిస్తూ ఉంటుంది. ఓ రోజు రేవంత్‌కు ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తుంది. ఆ అమ్మాయి తెలివితేటలు, చురుకుదనం, చిలిపితనానికి ముగ్ధుడైన రేవంత్ కూడా ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిపోతాడు. ఆమెను కలుసుకోవటానికి నానా తంటాలు పడుతుంటాడు. కానీ, ఎంత ప్రయత్నించినా ఆమె ఎవరో కనుక్కోలేకపోతాడు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా తన ఫోన్ నెంబర్ కనిపెట్టాలని ఆమె పందెం కాస్తుంది. గడువులోపు అతడు ఆమె ఫోన్ నెంబర్ కనుక్కుంటాడా? వరల్డ్ చెస్ ఛాంపియన్ రేవంత్ ఆమె కాసిన పందెంలో గెలుస్తాడా? పందెంలో గెలిచి తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నేరుగా కలుస్తాడా? లేదా? అన్నదే మిగితా కథ.
‘హలో ఐ లవ్ యూ’ చిత్రంలోని ఓ దృశ్యం
విళ్లేషణ : ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఫుల్ లెన్త్ సస్పెన్స్ రొమాంటిక్ నవల ఇది. ఎక్కడా బోరు కొట్టకుండా కొత్త కొత్త విషయాలను మనకు నేర్పిస్తూ కథ సాగుతుంది. క్షణం క్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ రేవంత్ తన ప్రేమను దక్కించుకోవటానికి పడే కష్టాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. క్లైమాక్స్ మనల్ని కంటతడి పెట్టించక మానదు. ఈ నవల ఆధారంగా 1997 ఓ సినిమా కూడా వచ్చింది. శ్రీకాంత్, సాధిక హీరో హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా పేరు‘ హలో ఐ లవ్ యూ’. ప్రేమలో ఉన్న వాళ్లు తప్పక చదవాల్సిన నవల ఇది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment