![telangana government increased financial support to kalyana laxmi scheme - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/13/shadi.jpg.webp?itok=SGBmr82l)
కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్(ఫైల్)
హుస్నాబాద్‌రూరల్: ఆడ పిల్ల పెళ్లా...! అబ్బో.. అనుకునే సామాన్య కుటుంబాలు ఆడపిల్ల పుట్టిదంటే కష్టాలు మొదలవుతాయని ఉహించుకొంటారు. అలాంటి వివక్షను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ కుటుంబాలకు చెందిన 3 లక్షల కు పైగా కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించింది.
వచ్చే ఏప్రిల్ నుంచి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116Sకు పెంచనుంది. జిల్లాలో 58,165 మంది కిశోర బాలికలు ఉండగా ఇందులో 50 వేల మందికి ఆరేళ్లలో ప్రయోజనం చే కూరనుంది. 4 వేల వరకు 18 ఏళ్లు దా టిన బాలికలకు తక్షణ లబ్ధి కలగనుంది.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్ల క్రితం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన అడపిల్లల పెళ్లిలకు 51వేల ఆర్థిక సహాయం అందజేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని బీసీలు, ఓసీలలోని పేద కుటుంబాలకు వర్తింపజేస్తూ పథకం నగదు ప్రోత్సాహకాన్ని రూ.75,116లకు పెంచింది.
ఆడబిడ్డలను కన్నవారిలో ఆనందం
ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే ప్రోత్సాహకాలను లక్షకు పెంచడంతో ఆడబిడ్డలను తల్లిదండ్రుల్లో కాస్త ఊరట కనిపిస్తోంది. ప్రభుత్వ సహాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 7వేల మంది కిశోర బాలికలు, 2వేల మంది పెళ్లి వయస్సు వచ్చిన యువతులు ఉండగా జిల్లాలో దాదాపు 40వేల మంది కిశోర బాలికలు, 12వేల వరకు పెళ్లి వయస్సు వచ్చిన ఆడపడచులకు ప్రయోజనం చేకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment