పూజా ఇన్‌ | Pooja Hegde joins the shoot for Trivikram | Sakshi
Sakshi News home page

పూజా ఇన్‌

Published Thu, Jun 6 2019 3:25 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

​Pooja Hegde Joins Allu Arjun For AA19 Second Schedule - Sakshi

పూజా హెగ్డే

ఇన్ని రోజులూ జోడీ లేకుండానే అల్లు అర్జున్‌ షూటింగ్‌ చేశారు. ఇక బన్నీ జోడీ పూజా హెగ్డే కూడా జాయిన్‌ అయ్యారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్, కె.యస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే జాయిన్‌ అయ్యారు. ‘‘అద్భుతమైన టీమ్‌తో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మిమ్మల్ని క్రే జీగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇందులో టబు, మలయాళ నటుడు జయరామ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement