2.ఓ. జనవరి 25న విడుదల
తమిళసినిమా: శివాజీ, ఎందిరన్ చిత్రాల తరువాత రజనీకాంత్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న మరో బ్రహ్మాండ చిత్రం 2.ఓ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూ పొందుతున్న ఈ భారీ చిత్రాన్ని లైకా సంస్థ సుమారు రూ.400 కోట్లతో నిర్మిస్తోంది. ఇందులో ఎమీజాక్సన్ నాయకిగా, హిందీ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతి నాయకుడిగానూ నటిస్తున్నారు. 2.ఓ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూ ర్తి అయ్యింది. 2.ఓ చి త్రాన్ని దీపావళికి తెరపై కి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించినా, ఆ త రువాత నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఆలస్యం కారణంగా జనవరి 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
చిత్ర విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమ్మర్ స్పెషల్‌గా 2.ఓ చిత్రం విడుదలయ్యో అవకాశం ఉన్నట్లు దర్శకుడి వర్గం పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి 2.ఓ చిత్ర గ్రాఫిక్స్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. ఇంకా ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. 12 రోజుల పాటు రజనీకాంత్, ఎమీజాక్సన్‌లపై చిత్రీకరించనున్న ఈ పాట కోసం చెన్నైలో బ్రహ్మండమైన సెట్ సిద్ధం అవుతోంది. చిత్ర విడుదల ఆలస్యం అన్న ప్రచారం గురించి లైకా సంస్థ నిర్వాహకుడు రాజుమురుగన్ స్పం దిస్తూ, 2.ఓ చిత్ర గ్రాఫిక్స్ వర్క్ నాలుగు దేశాల్లో శరవేగంగా జరుగుతోందని తెలిపారు. చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నట్లుగా జనవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని చెప్పారు.