
సమంత 30 లక్షలు, బన్నీ 10 లక్షలు
టాలీవుడ్ స్టార్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా మారుతున్నారు. తమ సినిమా ప్రచారాలతో పాటు.. తమ ఆలోచనలు, అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు సోషల్ మీడియానే వేదిగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఒక్కొక్కరికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరుతున్నారు. ఈ రేసు హీరోయిన్ సమంత, హీరో అల్లు అర్జున్లు అరుదైన ఘనత సాధించారు.
ఇటీవల సినిమాలను పక్కన పెట్టి పెళ్లి పనులతో బిజీ అయిన సమంత, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా నాగచైతన్యతో తన రిలేషన్ షిప్కు సంబందించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానుల ముందుంచుతూ ఆకట్టుకుంటుంది. అందుకే స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చే స్థాయిలో ఏకంగా 30 లక్షల మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది సామ్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ఫాలోవర్స్ లిస్ట్లో దూసుకుపోతున్నాడు. తన సినిమా అప్డేట్స్ను ఎప్పటి కప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే బన్నీ 10 లక్షల మంది ఫాలోవర్స్ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు స్టార్స్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.