
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. భారీ బడ్జెట్‌తో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చారిత్రక చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. చారిత్రక చిత్రం కావటంతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.
అందులో భాగంగా కేవలం ఒక్క యుద్ధ సన్నివేశానికే దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. సినిమాలో కీలక సమయంలో వచ్చే సీన్ కావటం, అదే సమయంలో గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉండటంతో భారీ ఖర్చు తప్పటం లేదని తెలుస్తోంది. జార్జీయాలో చిత్రీకరించనున్న ఈ వార్ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు కోసం పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment