ఉగ్రదాడిపై స్పందించిన ఆమిర్ ఖాన్ | Aamir Khan on Dhaka attacks: Terrorism and terrorists have no religion | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిపై స్పందించిన ఆమిర్ ఖాన్

Published Thu, Jul 7 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

ఉగ్రదాడిపై స్పందించిన ఆమిర్ ఖాన్

ఉగ్రదాడిపై స్పందించిన ఆమిర్ ఖాన్

ముంబై: సమాజంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై గళం వినిపించే బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ మరోసారి స్సందించారు. బంగ్లాదేశ్ లో జరిగిన రెండో ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాద్రానికి, ఉగ్రవాదులకు మతం లేదని వ్యాఖ్యానించారు. రంజాన్ పండుగ సందర్భంగా బాంద్రాలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఎవరైతే ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారో, ఉగ్రవాదులుగా మారుతున్నారో వారికి మతం లేద'ని ఆమిర్‌ ఖాన్ పేర్కొన్నారు. రంజాన్ రోజున తన తల్లితో నాణ్యమైన సమయం గడపనున్నట్టు 'దంగల్' స్టార్ తెలిపాడు.

బంగ్లాదేశ్ లోని షొలాకియా ప్రాంతంలో గురువారం రంజాన్ ప్రార్థనలు చేస్తున్నవారిపై ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. 14 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. వారం క్రితం ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరిపై దాడి చేసి 28 మందిని ఉగ్రదాదులు పొట్టన పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement