నరేశ్‌కు పెళ్లి గిఫ్ట్‌లా..! | Actor Allari Naresh to Sing for James Bond Tollywood Movie | Sakshi
Sakshi News home page

నరేశ్‌కు పెళ్లి గిఫ్ట్‌లా..!

Published Fri, May 15 2015 11:23 PM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

నరేశ్‌కు పెళ్లి గిఫ్ట్‌లా..! - Sakshi

నరేశ్‌కు పెళ్లి గిఫ్ట్‌లా..!

‘‘అల్లరి నరేశ్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికే తను మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. అల్లరి నరేశ్, సాక్షి చౌదరి జంటగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘జేమ్స్‌బాండ్’.  సాయికిషోర్ మచ్చ దర్శకుడు.  సాయికార్తీక్ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా  ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ -‘‘మా సొంత సంస్థలో సినిమా చేయడం కంటే... ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో చేయడానికే  ఎక్కువ ఇష్టపడతాను.

ఈ సినిమాలో నా కన్నా సాక్షి చౌదరి ఎక్కువ కష్టపడ్డారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా నరేశ్‌కు పెళ్లి గిఫ్ట్ కావాలి. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సాయికార్తీక్, రచయిత రామజోగయ్య శాస్త్రి, హీరో సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement