నటిపై చేయి చేసుకున్న యువకుడు | Actor Gauhar Khan slapped for 'skimpy' dress | Sakshi
Sakshi News home page

నటిపై చేయి చేసుకున్న యువకుడు

Published Mon, Dec 1 2014 10:45 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నటిపై చేయి చేసుకున్న యువకుడు - Sakshi

నటిపై చేయి చేసుకున్న యువకుడు

ముంబై: సెలిబ్రెటీలు ఎక్కడకు వెళ్లినా అభిమానులు పోటెత్తడం.. ఆ క్రమంలోనే అభిమానులపై నటీ నటులు చేయి చేసుకోవడం తరుచు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. ఒక టీవీ షోకు హాజరైన ఓ యువకుడు బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ను చెంపపై కొట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి ఓ టీవీ షోకు హాజరైన గౌహర్ ఖాన్ షూటింగ్ లో ఉన్న సమయంలో అకిల్ మాలిక్(24) అమాంతం స్టేజ్ పైకి వెళ్లాడు. అంతటితో ఆగకుండా ఆమెను తాకేందుకు యత్నించాడు. ఆ క్రమంలోనే అతను ఆమెపై చేయి చేసుకున్నాడు. అసలు ఈ షోకు కురచ దుస్తుల్లో ఎందుకొచ్చావంటూ ఆమెను ప్రశ్నించాడు.   దీంతో అప్రమత్తమైన అక్కడి సిబ్బంది అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి పోలీసులకు అప్పజెప్పారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు.  గత మూడు -నాలుగు రోజుల నుంచి ఆడియన్స్ లో సభ్యుడిగా ఉన్న మాలిక్ ఆ షోలో నటిపట్ల ప్రవర్తించాడని ఓ పోలీస్ అధికారి తెలిపాడు. అతను హీరోయిన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మద్యం సేవించి ఉన్నాడా?అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, అందుకోసం అతన్ని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement