బాలయ్య సరసన అంజలి.. మరొకరు ఎవరో? | Actress Anjali To Work With Balakrishna And Boyapati New Telugu Movie | Sakshi
Sakshi News home page

బాలయ్య సరసన అంజలి.. మరొకరు ఎవరో?

Published Sun, Feb 23 2020 10:50 AM | Last Updated on Sun, Feb 23 2020 10:50 AM

Actress Anjali To Work With Balakrishna And Boyapati New Telugu Movie - Sakshi

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర మాస్‌ చిత్రాల డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.  ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు, కథేంటి, టైటిల్‌ ఇదేనా అంటూ సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేయడానికి బోయపాటి బృందం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఆవకాశం ఉండగా.. ఒక కథానాయికగా తెలుగమ్మాయి అంజలిని ఎంపిక చేసినట్టు చిత్రబృందం తెలిపింది.

దీంతో బాలయ్య సరసన అంజలి నటించే రెండో చిత్రం ఇది కానుంది. గతంలో డిక్టేటర్‌ అనే చిత్రంలో ఈ తెలుగమ్మాయి నటించిన  విషయం తెలిసిందే. కాగా, మరో హీరోయిన్‌ ఎవరనేదానిపై సస్సెన్స్‌ కొనసాగుతూనే ఉంది. అయితే శ్రియనే ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. కానీ చిత్ర వర్గాల నుంచి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో అఘోరాగా కనిపించున్నాడని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. సింహా, లెజెండ్‌ హిట్‌ చిత్రాల కాంబినేషన్‌ తర్వాత వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా తొలి షెడ్యూల్‌ వారణాసిలో ప్లాన్‌ చేసినట్టు సమాచారం.

చదవండి:
బాలయ్యకు ‘సినిమా’ కష్టాలు!
బాలయ్య న్యూలుక్‌ అదిరింది!!​​​​​​​
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement